Тёмный
No video :(

అధ్యాత్మవిద్య ప్రవచనం-19 

Medha Spiritual
Подписаться 697
Просмотров 588
50% 1

ముఖ్యాంశాలు
1. సత్=ఉనికి=పరమాత్మ=బ్రహ్మము=ఆత్మ. ఉపనిషత్తులు బ్రహ్మము, ఆత్మ అంటాయి. ఉనికి, సత్ అనేవి మఠంలో ఎక్కువగా వాడే పదాలు. పరమాత్మ అనేది భక్తుడి వ్యక్తీకరణ. అన్ని పదాలు ఒక్క సచ్చిదానందములనే చెప్తున్నాయి.2. సృష్టికి పూర్వం ఉనికి=ఉండుట=Existence మాత్రమే ఉంది. ఆ ఉనికి, సృష్టిలో అండాండము-పిండాండము-బ్రహ్మాండములనే మూడు రూపాలలో వ్యక్తమయింది. 3. అండము: అంటే సృష్టిలో ఉనికియొక్క పూర్ణ సమర్థ స్వరూపము (Potentiality of Existence in the Universe).4. అండాండము: గుడ్డులో కోడి, బీజములో చెట్టు, అవ్యక్త రూపంలో (manifest కాకముందు) ఉన్నట్లు, సచ్చిదానందములు అవ్యక్త రూపంలో ఉన్నది అండాండము. 5. బ్రహ్మాండము: అంటే ఈ విశ్వమంతా (entire universe), పాలపుంతలు(Milkyways/galaxies), సూర్యమండలాలు, భూమి, సకల చరాచరజీవరాసులన్నీ కలిపి చెప్పినది. ఇవి జడములు, చైతన్యములని రెండు రకములు. 1. సూర్యచంద్రులు, పర్వతాలు, నదులు మొదలైనవాటిలో ఉనికి వ్యక్తమైనప్పటికీ వాటికి తమ ఉనికి తెలియనందువలన అవి జడములు. అక్కడకూడా చిదానందములు ఉన్నప్పటికీ వ్యక్తం కాలేదు. 2. చైతన్యములు అనబడే ప్రాణులలో చరములు (కదిలేవి), అచరములు(కదలలేనివి) అని రెండు రకాలు ఉన్నాయి. చెట్లు అచరములు. చెట్లకు సచ్చిదానందములు మూడూ ఉన్నాయి. కానీ ఆనంద లక్షణము, అంటే సమృద్ధిగా తనను గుర్తింౘగలిగే లక్షణము పూర్తిగా ఎదగ లేదు( develop కాలేదు). ప్రాణులు, అంటే జీవరాసులకు సచ్చిదానందములు మూడూ వ్యక్తమవుతాయి. అందుకే సృష్టికి జీవుడు ముఖ్యం. జీవుడు లేకపోతే సృష్టే లేదు. ప్రాణులలో సచ్చిదానందములను గ్రహించి వ్యక్తం చేయగలిగినది ఒక్క మనిషి మాత్రమే.6. పిండాండము: అండాండములో, సృష్టి ౙరుగుటకు కావలసిన potentiality పూర్తిగా ఉన్నది, కానీ వ్యక్తము కాలేదు. బ్రహ్మాండములో పూర్తిగా వ్యక్తమయింది. పిండమంటే సంఘాతం చేసినది. ఒక వ్యక్తిగతరూపంలో వచ్చిన ప్రాణి పిండాండం. మొత్తం బ్రహ్మాండంలో ఏదుందో, అది పిండాండంలోకూడా ఉన్నది. అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్క ప్రాణిలో అంత రచన(design) ఉన్నది. 84లక్షల జీవరాసులన్నిటిలో మనిషియొక్క విశిష్టత వేరు. 7. ఆహార-నిద్రా-భయ-మైథునాని, సామాన్యమేతద్ పశుభిర్నరాణాం,జ్ఞానం నరాణాం అధికో విశేషః, జ్ఞానేన హీనః పశుభిస్సమానః.పశుపక్షులకున్న జ్ఞానము, తిండితిప్పలు-నిద్ర-భయము-పిల్లలనుకనటం వఱకే పరిమితమైంది. కాని మనిషికి తనను తాను తెలిసికొనే జ్ఞానముంది. ఇది మనిషి జన్మ విశిష్టత.8. మానవదేహనిర్మాణము అద్వితీయం. సృష్టికి తేజోబిందువు మనిషి. బయటిదంతా Macro Cosmos/External Cosmos అంటారు. మనిషికి గ్రహింపు శక్తి ఉందిగనుక, వీడిని Comprehending Cosmos అంటారు. అంటే ౘూస్తే గ్రహింౘగలడు, అర్థం చేసుకోగలడు, అనుభవింౘగలడు. మనిషిని, ఒకవైపు దాటివచ్చిన పశుపక్షాదుల జన్మల వాసనలు వెనక్కి లాగుతుంటాయి, ఇంకోవైపు లోపల ఉన్న ఎదిగే తేజస్సు పైకి లాగుతున్నది.9. బ్రహ్మవిద్య: అధ్యాత్మవిద్యను బ్రహ్మవిద్య అనికూడా అంటారు. బృహి-వృద్ధౌ, అంటే ఎదగటం. బ్రహ్మవిద్య అంటే ఎదుగుటతో తనను తెలిసికోవటం. అమీబానుండి, చతుర్ముఖబ్రహ్మవఱకు అందరూ బ్రహ్మమే. అమీబాకూడా నేనున్నానని గుర్తిస్తుంది. పశుపక్షాదులన్నీ అట్లా గుర్తిస్తున్నాయి, కాని వాటిదేహానికి పరిమితంగా గుర్తిస్తున్నాయి. వాటి దేహాలకు తగినట్లుగా ప్రవర్తిస్తాయి. మనిషిజన్మకు వచ్చేసరికి ఆహారనిద్రాభయమైథునాలు తగ్గిపోతాయి. పౌరుషం, కౄరత్వం తగ్గిపోతుంది. ఇంకా కౄరత్వం బాగా ఉన్నవాళ్ళు కొత్తగా మనుష్యజన్మ ఎత్తినవాళ్ళు. జన్మలు గడుస్తుంటే సంస్కారం పెరిగి క్రమంగా అది తగ్గిపోతుంది. అప్పుడు సాధువై, జిజ్ఞాసువై, సాధకుడై తనను తాను తెలిసికొంటాడు. జ్ఞానం నరాణాం అధికో విశేషః. నరుడికి స్వరూపాన్ని ధరింౘగలిగిన సామర్థ్యముంది. కానీ వాడి రచన, సమర్థత, దాని పరిమితి వాడికి తెలియదు, తెలిసికోవాలి. అప్పుడు సరిగ్గా ఉపయోగింౘుకోగలుగుతాడు.10. సాధన: సాధనలో మూడు అంశములు. 1. సాధన పరిధి/శరీరము 2. సాధన
3. సాధనయొక్క కేంద్రము/ఆత్మ. ముందుగా సాధన-శరీరముగుఱించి తెలిసికొందాము.11. శాస్త్రప్రకారము మనిషికి స్థూల-సూక్ష్మ-కారణ శరీరాలున్నాయి. ఇంకొక వ్యక్తీకరణలో అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ-ఆనందమయ కోశములని పంచకోశములున్నాయి. ఆత్మను వీటికంటే వేరుగా చెప్పుతున్నది శాస్త్రము.12. కోశము: కత్తి ఆకారములోనే ఉన్న ఒర, దానికి కోశము. అది కత్తియొక్క తేజస్సును రక్షిస్తుంది. పండ్లకు పైన ఉన్న తోలు ఒక కోశము. కొన్ని పండ్లకు అనేక కోశములుంటాయి. అవి లోపల ఉన్న సారమును రక్షిస్తాయి. వడ్లలో పైన ఉన్న పొర బియ్యానికి కోశము, దాన్ని రక్షిస్తుంది. బియ్యము, లోపలున్న సారమును, అంటే Carbohydrates ను రక్షిస్తాయి. ఈ పైపొరను fiber అంటారు. ఇది మలంగా వెళ్ళిపోతుంది. బ్రహ్మాండంలో ఏ రచన ఉన్నదో పిండాండంలో కూడా అదే రచన ఉన్నది. దీనికున్న మూడు ఆవరణలు స్థూల-సూక్ష్మ-కారణ శరీరములు.13. స్థూలశరీరం: స్థూలంగా కనిపించేది స్థూలశరీరం. స్థూలశరీరమెట్లా ఏర్పడిందంటే --అన్నరసేనైవ భూత్వా, అన్నరసేన అభివృద్ధిం ప్రాప్య,అన్నరసమయ పృథివ్యాం యద్విలీయతే, సః అన్నమయ కోశః, తదేవ స్థూల శరీరః. …. పైంగల ఉపనిషత్ 2అఅన్నమయకోశమన్నా, స్థూలశరీరమన్నా రెండూ కూడా అన్నంచేత ఏర్పడినవి. అద-భక్షణే, ఏది భక్షణ చేస్తున్నాడో అది అన్నం, కేవలం బియ్యపు అన్నం కాదు. స్థూలశరీరం అన్నరసంచేత ఏర్పడింది. అన్నరసంచేతనే పెరుగుతోంది. ఆ పెరిగినది మళ్ళీ అన్నరసమయమైన ఈ భూమిలో విలీనమైపోతుంది. ఇది అన్నమయకోశం. ఇదే స్థూల శరీరం. 14. ఈ స్థూలశరీరంలో అవయవములు, అంగములు ఉన్నాయి. అంగములంటే కాళ్ళూ, చేతులు మొదలైనవి. అవయవములంటే లోపల ఉన్న గుండె, ఊపిరితిత్తులు, జీర్ణకోశము, మూత్రపిండాలు, ముఖము, కన్ను, ముక్కు, చెవి మొదలైనవి. 15. సప్తధాతువులు: స్థూలశరీరం ఏర్పడటానికి అన్నరసమునుండి సప్తధాతువులేర్పడినాయి. సప్తధాతువులేమిటంటే 1. రసం 2. రసమునుండి రక్తం 3. రక్తమునుండి మాంసం 4.మాంసమునుండి మేధ (అంటే కొవ్వు) 5. కొవ్వునుండి ఎముకలు 6. ఎముకలనుండి మజ్జ(Bone marrow) 7.మజ్జనుండి శుక్లశోణితములు (అంటే వీర్యకణములు) ఏర్పడతాయి. ఈ దేహమంతా సప్తధాతువుల రచన, పంచమహాభూతములతోనే ఏర్పడింది. ఈ దేహం కేవలం Hardware. Software లేకుండా ఇది పనిచేయదు. ఓం తత్ సత్

Опубликовано:

 

4 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Я ДОСТРОИЛ ЗАВОД - Satisfactory
19:13
Просмотров 124 тыс.