Тёмный

అధ్యాత్మవిద్య ప్రవచనం-20 

Medha Spiritual
Подписаться 717
Просмотров 477
50% 1

Pravachanam_0020at_Fact110724
ముఖ్యాంశాలు
1. శరీరమాధ్యం ఖలు ధర్మసాధనం.
మాధ్యం అంటే medium/media, ద్వారం. ఖలు అంటే స్పష్టమైన. సాధనమంటే ఒక పరికరం. ధర్మాన్ని ఆచరింౘటానికి శరీరమనేది ఒక స్పష్టమైన పరికరం. ధారణాయ శక్యమితి ధర్మః. ధరింౘడానికి తగినది ధర్మం. సచ్చిదానందస్మృతిని ఎల్లప్పుడూ ధారణలో నిలుపుకోవడం ధర్మం. శరీరం, సచ్చిదానందస్మృతిని దర్శనం చేయడానికి, ధారణ చేయడానికి, ఒక స్పష్టమైన పరికరం. కానీ మనిషి, తనశరీరం భోగాలు అనుభవింౘడానికే అనుకుంటున్నాడు. 4 నుండి 8 సం॥ బాలుడికి Cell phone ఇస్తే Games ఆడుకుంటాడు. ఏమీ తెలియని అజ్ఞాన బాలుడు, అది entertainment కోసమే ఉన్నదనుకొంటాడు. అట్లాగే ఒక సామాన్యుడు, దేహేంద్రియాలున్నది భోగింౘడానికే అనుకుంటున్నాడు.
2. నిష్ణాతుడైన driver, steering, clutch, brake, gear అన్నీ తన వశం చేసికొని, car నేనన్నట్లుగా స్వరూపం చేసుకున్నాడు. అట్లాగే మన దేహంకూడా ఒక vehicle యే! చిన్నపిల్లవాడు, కాళ్ళాడిస్తూ, చేతులాడిస్తూ, కళ్ళు తిప్పుతూ నెమ్మదిగా ఒక్కొక్క ఇంద్రియాన్నీ తన వశంలోకి తెౘ్చుకుంటాడు. ఇవన్నీ చేసి దేహాన్ని వాడుకోవడంలో నిష్ణాతుడవుతాడు. Car నేననుకున్నట్లు, దేహం నేననుకున్నాడు. దేహం నాది కానీ, నేను కాదు. నేను దేహమనుకుంటే నష్టమేమిటంటే, దేహానికి కలిగే సుఖదుఃఖాలను నావి అనుకుంటాడు. దేహం మరణిస్తే నేను మరణించేవాడిననుకుంటాడు.
3. స్థూలశరీరం అన్నరసంచేత ఏర్పడింది. ఏ పదార్థానికైనా అస్తి-జాయతే-వర్ధతే-విపరిణమతి-క్షయతి-నశ్యతి, అంటే, ఉండుట-పుట్టుట-పెరుగుట-మార్పులుచెందుట-క్షీణింౘుట-మరణింౘుట అనే షడ్భావ వికారాలు (ఆరు మార్పులు) ఉంటాయి.
4. దేహానికి ఉన్న దశలు: శైశవం, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. ఇవి అనుభవ దశలు. ఇంతకుముందు చెప్పిన ఆరు మార్పులు, అనుభవంలో ఇక్కడ తెలుస్తాయి. తల్లి గర్భంలో అస్తి - ఉన్నాడు. జాయతే - శిశువుగా పుడతాడు. శైశవం అంటే అడ్డాలబిడ్డడు. లేచి నిలబడ్డప్పటినుండి 7/8 సం॥ వఱకు బాల్యం - వర్ధతే. 8 నుండి 16 సం॥ వఱకు కౌమారం - వర్ధతే. యవ్వనం అంటే 16 నుండి 40 సం॥ వఱకు - విపరిణమతి. 40 నుండి 60 సం॥ వఱకు - విపరిణమతి. తరువాత వార్ధక్యం - క్షయతి. ఇక్కడ, అవస్థలు మారుతుంటే నేను మారానా అన్నది ౘూౘుకోవాలి. ఈ అవస్థలు దేహానికి వచ్చినాయి. నాకు కాదు. శైశవంలో ఛీ! ఛీ! అంటే నన్ను పిలుస్తున్నారు అని నవ్వుతాడు. నేను పలుకుతున్నాననుకుంటాడు. తరువాత రాము అని పేరుపెడితే, "రామూ ఇటురా" అంటే రామును పిలిచారనుకోడు, నన్నే పిలుస్తున్నారనుకుంటాడు. ఏ వయసులో ఐనా "రామూ" అంటే నన్నే పిలుస్తున్నారనుకుంటాడు, నేను పలుకుతున్నాననే అనుకుంటాడు. అంటే దేహానికి దశలు మారినా, లోపల ఉన్న “నేను” అన్న భావం మారటం లేదు.
5. శైశవంలో వాడికి అమ్మ కావాలి, అదే సుఖం. బాల్యంలో వాడికి remote control car బొమ్మయే ఇష్టం, సుఖం. కౌమారంలో గల్లీలో cricket ఆడుకోవడం సుఖం. యవ్వనంలో bike సుఖం, girl friend-boyfriend సుఖం. అమ్మవడి, remote control car, cricket అవసరం లేదు. వృద్ధాప్యం వచ్చిన తరువాత భార్యతో సుఖం అవసరం లేదు. మనమలు మనుమరాళ్ళు సుఖం. అంటే సుఖమెప్పటికప్పుడు మారిపోతూనే ఉంది. ఆ మారిపోతున్న సుఖదుఃఖాలకు లోపల నేను గురైంది. తనను దేహంతో పోల్చుకుంటే జీవితానికి మరణమే గమ్యం.
6. పుట్టడానికిముందు, ౘచ్చిపోయిన తరువాత ఎవడుంటాడో వాడే నేను. నేను అమృత స్వరూపుడను. పరమాత్మను తెలిసికోవడానికి సాధన చేయకుండా, ధర్మాన్ని ఆచరింౘడానికి సాధన చేయకుండా, తీర్థయాత్రలు, పూజలు, వ్రతాలు చేస్తే మనం అమృత స్వరూపులవటంలేదు. ఇవన్నీ చేసినప్పటికీ సుఖదుఃఖాలు వస్తూనే ఉన్నాయి.
7. దేహినోస్మిన్ యథా దేహే, కౌమారం యవ్వనం జరా,
తథా దేహాంతర ప్రాప్తిః, ధీరస్ తత్ర న ముహ్యతి. ………. భగవద్గీత 2.13
దేహి, అంటే దేహంలో ఉన్నవాడికి, ఎట్లాగైతే ఈ శైశవ-బాల్య-కౌమార-యవ్వన-వార్ధక్య దశలున్నాయో, దేహాంతర ప్రాప్తి, అంటే ఈ దేహాన్ని విడిచి ఇంకో దేహానికి వెళ్ళటమనేది అట్లాంటి దశయే! దీంట్లో ధీరుడైనవాడు మోహంలో పడడు, చింతింౘడు. దేహం పోయినా నేనుంటాను అన్న సత్యం వాడికి తెలుసు. సాధనలో ఎదిగిన సాధకుడికి ఇప్పుడెట్లాగుందో, మరణం తరువాత అట్లాగే ఉంటుంది.
8. స్థూలదేహం నేననుకుంటే వచ్చే అవాంతరలు ఎన్నో ఉన్నాయి గనుక, స్థూలదేహం నేను కాదని అనుభవంలో తెలిసికోవాలి.
9. గత ప్రవచనంలో, స్థూలదేహం దేనిచేత ఏర్పడుతుందో తెలిసికొన్నాము. ఇప్పుడు ఆ స్థూలదేహం నేననుకుంటే వచ్చే కష్టనష్టాలు ఏమిటో, దానినుండి బయటపడడం ఏట్లాగో తెలిసికొన్నాము. కనుక నేను ఈ స్థూలదేహమనుకొని దీని maintenance కే జీవితమంతా గడపకూడదు. దీన్ని వాడుకోవాలి, car ఉంటే దాంట్లో ప్రయాణం చేసినట్లు. ఆ ప్రయాణం "శరీరమాధ్యం ఖలు ధర్మసాధనం," అంటే స్వరూపాన్ని ధారణ చేయటానికి శరీరము స్పష్టమైన పరికరం. పరికరాన్ని ప్రేమింౘొద్దు, మోహంలో పడొద్దు, ద్వేషించొద్దు, దాన్ని శుష్కింపజేసి, క్షీణింపజేసి కష్టపెట్టొద్దు, వాడుకోవాలి. ఇప్పుడు నేర్చుకొన్నదేమిటంటే, నేను స్థూలశరీరంకంటే వేరు అన్న భావనను అనుభవంలో ౘూడాలి.
ఓం తత్ సత్

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
БЕЛКА РОЖАЕТ?#cat
00:28
Просмотров 283 тыс.