SMJ CREATIONS is a RU-vid Channel that brings forth new songs needed for Telugu Catholic Church. It also produces many more spiritual videos on the Catechism of the Catholic Church and the lives of saints. It is also trying to clarify questions related to the Catholic Faith, practices, and traditions. If you are watching for the first time or have not yet subscribed, Please subscribe to SMJ CREATIONS to receive the latest videos to help you grow in your Christian Faith
Lyrics:
Fr. Yohanu Katru MF
మరియతల్లి గీతం
సాకీ
అమ్మా మరియ జపమాలమాతా...
అమ్మా మరియ
అనుగ్రహమాతా...
పల్లవి
అమ్మా మరియ జపమాలమాత
అమ్మా మరియ అనుగ్రహమాత
మా అభయమై - మా ఆశవై
మా ధైర్యమై - మా దీవెనై
మా గోడు వినుమా
నీ సుతుని వేడుమా
నీ దివ్యతనయుని మాకై వేడుమా
కోరస్
ఆవే.. ఆవే.. జపమాలమాత
ఆవే.. ఆవే.. అనుగ్రహమాత
చరణం 1
భక్తిహీనుల త్రోవలో మేము పయనించితిమి
ఇహమందు అపజయాలతో మేము కృంగిపోతిమి
జపమాల ప్రార్ధనతో మమ్ము బలపరచుమా
జయమిచ్చు క్రీస్తులో మమ్ము స్థిరపరచుమా
కోరస్
ఆవే.. ఆవే.. జపమాలమాత
ఆవే.. ఆవే.. అనుగ్రహమాత
చరణం 2
ఈలోకపోకడలకు మేము దాసోహమైతిమి
సాతాను వంచనలకు మేము బందీలమైతిమి
నీ నిత్య ప్రార్థనతో మమ్ము కాపాడుమా
రక్షకుని బాటలో మమ్ము నడిపించుమా
కోరస్
ఆవే.. ఆవే.. జపమాలమాత
ఆవే.. ఆవే.. అనుగ్రహమాత
18 сен 2024