Success story of Jamun Farming by Ramreddy Damodara Reddy, Suryapet District.
చౌడు భూముల్లో అల్లనేరేడు సాగుతో సిరులు కురిపిస్తున్న సూర్యాపేట జిల్లా రైతు
వాణిజ్యపరంగా నేరుడుకు మంచి మార్కెట్ డిమాండ్ ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు వేగంగా విస్తరిస్తోంది. నాటిన 4 వ సం. నుండి దిగుబడినిచ్చే ఈ పంటలో సుదీర్ఘ కాలంపాటు రైతులు మంచి ఆర్థిక ఫలితాలు పొందవచ్చు. చెట్ల వయసు పెరిగే కొద్దీ ఎకరాకు 10 టన్నుల దిగుబడి తీసే అవకాశం వుంది. చౌడు, నేలలు, సమస్యాత్మక భూముల్లో సైతం, పెరగగల ఈ మొండిజాతి చెట్టు మే నెల నుండి ఆగష్టు వరకు పండ్ల దిగుబడినిస్తుంది. ప్రస్థుతం అందుబాటులో వున్న అల్ల నేరేడుకు ప్రత్యామ్నాయంగా, మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన బహడోలి రకం సాగుచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు సూర్యాపేట జిల్లా రైతు రాంరెడ్డి దామోదర్ రెడ్డి. ఆ వివరాలు కర్షక మిత్రలో మీకోసం..
Facebook : mtouch. maganti.v...
#Karshkamitra #Jamunfarming #Allneredusagu
28 июл 2020