Тёмный

ఎన్నినాళ్ళు మాకీ శ్రమలు ఎరుక చెప్పరావమ్మా //తెలుగు భజన పాటలు //devotional songs 

vvreddy highlights
Подписаться 47 тыс.
Просмотров 25 тыс.
50% 1

#లిరిక్స్ #descriptionలో #చూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
======
ఎన్నినాళ్ళు మాకీ శ్రమలు ఎరుక చెప్పరావమ్మా
కన్నీళ్ళతో కాళ్ళు కడిగినా మనసు కరుగదేమమ్మా
బాధలతో బందీనేనై బ్రతుకు గడుపు చున్నాను
నిందలు నిష్టూరాలతో గుండె పగిలి ఉన్నాను
నీ కొరకై వేయి కనులతో ఎదురుచూస్తు ఉన్నాను
మంచి వారి నెంచి చూడగా వారి కెన్నో వంచనలే
దురాచార దుర్మార్గులకు అడుగడుగున విజయాలే
ఏమిటి విధి వింతనాటకం అది అంతము నీ లీలే
పాఠశాలలో పిల్లలకు పరీక్షలు పెడతారు
ఉత్తర్ణులు కావాలంటు బెత్తములో కొడతారు
సోమరిగా వున్న వారిని గాలికి వదిలేస్తారు
నిన్నునమ్ము వారి నెల్ల నిష్ఠకోలుపోనీవు
కష్టాలు బాధలు పెట్టి కలుషము కడిగేస్తావు
శుద్దముగా వున్నవారినీ వద్ద చేర్చు కుంటావు
తల్లి నీవు తండ్రినీవు గురు దైవం నీవమ్మా
గుండెలోన నిండుగ వెలిగే పరంజ్యోతి నీవమ్మా,
జీవరాశులను నడిపించే ప్రాణశక్తి నీవమ్మా

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 22   
Далее