Тёмный

ఓ క్రైస్తవుడా నీ పరిస్థితి ఏంటి పరిశీలన చేసుకొ ll యేసు క్రీస్తు చిత్తం మరియు ఆశీర్వాదం JESUS ARMY 

Jesusarmy
Подписаться 450
Просмотров 47
50% 1

లూకా 15:1 ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా
లూకా 15:2 పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
లూకా 15:3 అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను
లూకా 15:4 మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?
లూకా 15:5 అది దొరకి నప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసి కొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి
లూకా 15:6 మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పి పోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా.
లూకా 15:7 అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోషము కలుగును.
లూకా 15:8 ఏ స్త్రీకైనను పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా?
లూకా 15:9 అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణము దొరకినదని వారితో చెప్పును గదా.
లూకా 15:10 అటు వలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.
లూకా 15:11 మరియు ఆయన ఇట్లనెనుఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.
లూకా 15:12 వారిలో చిన్నవాడుతండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
లూకా 15:13 కొన్నిదినములైన తరు వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను.
లూకా 15:14 అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,
లూకా 15:15 వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.
లూకా 15:16 వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.
లూకా 15:17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడునా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.
లూకా 15:18 నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి--తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;
లూకా 15:19 ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.
లూకా 15:20 వాడింక దూర ముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.
లూకా 15:21 అప్పుడు ఆ కుమారుడు అతనితోతండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యు డను కాననెను.
లూకా 15:22 అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;
లూకా 15:23 క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము;
లూకా 15:24 ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.
లూకా 15:25 అప్పుడు అతని పెద్ద కుమా రుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని
లూకా 15:26 దాసులలో ఒకని పిలిచిఇవి ఏమిటని అడుగగా
లూకా 15:27 ఆ దాసుడు అతనితోనీ తమ్ముడు వచ్చి యున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి నందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను.
లూకా 15:28 అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను.
లూకా 15:29 అందుకతడు తన తండ్రితోఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు.
లూకా 15:30 అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.
లూకా 15:31 అందుకతడుకుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి,
లూకా 15:32 మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@endtimeministry_bahrain
@endtimeministry_bahrain 15 дней назад
Amen
Далее
МУЖСКИЕ ДУХИ
00:33
Просмотров 108 тыс.
The joker favorite#joker  #shorts
00:15
Просмотров 14 млн
P A SWAMY SHORT MESSAGE
17:56
Просмотров 3,4 тыс.