గురువుగారు అన్న ఎన్టీఆర్ గారి గురించి చెబుతూ ఉంటే మా మనసు పరవశిస్తుంది తెలుగు తెలుగు వాడు అంటే ఏమిటో ఈ రాష్ట్రానికికాదు దేశానికి యావత్ ప్రపంచానికి తేలియా చేసినవాడు పాఠ్యపుస్తకాలలో అన్నగారి ఘనకార్యాలను చేరిస్తే భావితరాలు అయినా బాగుపడతాయి జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ గరికపాటి గారికి వందనం అభివందనం
నరసింహారావు గారూ నమస్తే. గంగమ్మ యెంతో పవిత్రమైనది, మహా శక్తివంతమైనది. గంగ తనకు జన్మించిన యేడుగురు సంతానాన్ని జన్మించిన వెంటనే నదిలో కలిపివేసి వాళ్ళ జీవితాలను అంతం చేసింది. తన 8 వ బిడ్డను జన్మించిన వెంటనే అదే విధంగా నదిలో కలిపి అంతం చేయడానికి ప్రయత్నించుచుండగా, ఆ బిడ్డ తండ్రి శంతన మాహారాజు గారు ఆడ్డుకొనగా, గంగమ్మ ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి, ఆ బిడ్డకు దేవ వ్రాతుడని పేరుపెట్టి, విద్యా, బుద్దులు నేర్పి, పరశురాముని దగ్గర యుద్ధ విద్యలు నేర్పించి ఆ దేవ వ్రాతుడిని ఆతని తండ్రి శంతన మహారాజు దగ్గర వదలి వెళ్ళిపోతుంది. ఆ బిడ్డ దేవవ్రతుడు రాజ్యత్యాగము చేసి గాంగేయుడుగా, భీష్ముడుగా 125 సం. జీవించి, అర్జునుడి చేతిలో ప్రాణాలు వదిలితే గంగమ్మ అర్జునుడు మీద కోపించి ఆయన్ని శపించడం సమంజసం అంటారా? భీష్ముడు కూడా తన జీవితం చాలించాలనే ఆలోచనకు వచ్చాడనీ, తాను పేడి తో యుద్ధం చేయననీ, పేడిని ముందు పెట్టుకొని తన తో యుద్ధం చెయ్యమని అర్జునుడికి సలహా యిచ్చింది భీష్ముడే కదా? ఈ మానవ జన్మనుండి విముక్తి పొందాలని కోరుకున్నది భీష్ముడే కదా! అన్నీ తెలిసిన అమ్మవారు అర్జునుడిని యెందుకు శపించింది?
క్షమించాలి సారు! శ్రీ కృష్ణ విజయం సినిమాలో* జోహారు శిఖి పించ మౌళి* అనే పాటలో నర్తించినది డ్రీంగర్ల్ గా ప్రసి ద్ధిగాంచిన హేమ మాలిని గారు . ఈ పాట కలర్లో వుంటుంది. ఆమెది అప్పరసలను సైతం తలదన్నే అందం. అభినయం నాట్యం ఆమె సొంతం.
చాలా చాలా బాగున్నాయండి మీ మాటలు గరికపాటి నరసింహారావు గారి నెంబరు ఫోన్ నెంబర్ ఉంటే ఎవరైనా తెలియజేయగలరు వారి కార్యక్రమం మేము పెట్టాలి అనుకుంటున్నాము కనుక దయచేసి ఫోన్ నెంబర్ ఉంటే అర్జంటుగా మెసేజ్ పెట్టగలరు
ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు ఆయన నటించిన ప్రతి సినిమాలో రాముడుగా కృష్ణుడుగా రకరకాల సన్నివేశాల్లో పాత్రలకు కాకుండా ప్రతి తెలుగువాడు కన్నుల్లో సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమయ్యే కనబరుస్తూ పాత్రలను అవలంబిస్తూ ఆయన నట జీవితాన్ని సాగించారు
Subhodayam guru gariki padamuluku shatakoti vandamulu very good song lyrics in very happy every moment and sentence about sr ntr gurinchi bagaa chaparu dhanyavadalu 🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
గరికపాటి నరసింహరావు గారు మహా అద్భుతంగా చెప్పారు నందమూరి తారకరామారావు గారు మన తెలుగు వారు గర్వించదగ్గ నటులు ఏ భాషా సినీ రంగములో లేని నటనాగ్రేస చక్రవర్తి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అది మన తెలుగువారి అదృష్టం కారణజన్ముడు మహామనీషికి జోహర్లు
గరికపాటివారికి నమస్కారాలు ఎన్.టి.ఆర్ గారి గురించి మాట్లాడి మా మనస్సులను రంజింపచేశారు. ఎన్.టి.ఆర్. ఏ.ఎన్ఆర్. ఎస్.వి.ఆర్. ఈ కోవకి చెందిన వారే ఇంకొకరున్నారు.ఒక తిమ్మరుసు ఒక బలరాముడు ఒక విశ్వామిత్రుడు లాంటి పాత్రలు పోషించి తాను తప్పమరెవ్వరూ చేయలేరనేంతగా ప్రజలను మైమరపించారు. ఆయనే గుమ్మ డి గారు నభూతో సభవిష్య తి అనేలగా మెప్పించారు.ఆయనకి పద్మశ్రీ ఇవ్వాలని నా కోరిక సందర్భం వచ్చినప్పు మీరు మాట్లాడ గలరు .నమస్తే. ,🙏🙏🙏
శ్రీ గరికపాటి నరసింహారావు గారిలో కొత్త కోణాన్ని చూస్తున్నాను. మీరు అద్భుతమండీ.. ఆయ్ అంతేనండి. మీరు మాకంటే గొప్పNTR గారికి అభిమానులని తెలుసుకున్నామండీ. ధన్యవాదములు.
రావణాసుడు దుర్యోధనుడు కిచకుడు లాంటి పాత్రలు నటించి శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి వారిని మనం దేవుళ్ళుగా భావించేవాళ్ళను వక్రీకరించి చూపించడం తప్పు కాదా జై లక్ష్మి రామారావు
నందమూరి తారకరామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఆయన పురుషుడు కాదు యుగపురుషుడు అంతటి మహోన్నతమైన అటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో జన్మించడం గర్వ కారణంగా చెప్పుకోవచ్చు పౌరాణిక లోని మహారాజుగా వెలుగొంది నటువంటి గొప్ప నటుడు నందమూరి తారకరామారావు గారు
ఎన్నో విషయాలు... NTR గురించి మీ ద్వారా మీ శైలిలో... ఆ మహనీయుని గురించి తెలుసు కో గలిగాము.. ధన్యులం... గర్వం గా ఉంటుంది... NTR, ANR, SVR, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి... లాంటి ఎందరో మన తెలుగు సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలు... సి నా రె, దేవులపల్లి, అత్రేయ, ఆరుద్ర, వేటూరి శ్రీశ్రీ వంటి ఎందరో తెలుగు సినీ కవులు,,, గురజాడ, రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి వంటి సంఘ సంస్కర్తలు... ఉన్న, పుట్టిన మన తెలుగు నేల...,,ప్రవచన ఘనాపాటి గరికపాటి.. చాగంటిలాంటి..వీరంతా...మన వాళ్లే అన్న భావన... గొప్ప ఆనందానుభూతి... కలిగిస్తుంది... తలచుకుంటేనే.. ధన్యులం... అన్న భావన కలుగుతుంది.... 🙏🙏 ఎందరో మన తెలుగు మహానుభావులు... అందరికీ పాదాభివందనం 🙏🙏🙏.. మీసాల ప్రసాద రావు.... విశ్రాంతి గురుకుల హిందీ ఉపాధ్యాయులు.. విజయవాడ 🙏🙏
ఛానల్ వారికి నమస్కారం దయచేసి టైటిల్ పెట్టేటప్పుడు తెలుగును సరిగా వ్రాయగలరు అని మనవి చేస్తున్నాను. ఉదా: పాడిన అనే పదం బదులు పడిన అని పెట్టారు గమనించగలరు. ధన్యవాదములు.
సార్ నమస్కారములు దుష్ట పాత్ర లలో మంచి చూపించడము మంచిదే కానీ సాత్విక పాత్ర లను దుష్టులగాచూపడము సబబుకాదు... కొన్ని దురభిప్రాయములను ఆయన లాంటి నటుడు సినిమా లోబలవంతంగా చొప్పించుటచే చెడును ప్రోత్సాహం చేసినట్లుయింది..ఆయన ఏ పాత్ర ధరిస్తే అది గొప్ప..ఇతర పాత్రలను తక్కువ చేయడం ఆయన స్వీయ దర్శకత్వంలో చూస్తాం...అభిమానపు రంగు టద్దాలు వివేకవంతులైన తర్వాత వదులుకోవాలి.. వేణు గోపాల్ ముని గోటి ...
మీరు పాడిని పాట చిత్రం పేరు. నిండు సంసారం. ఈ పాట రాసిన వారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి. సంగీతం టీ. వి. రాజు. ఈ సినిమా నీ నవ జ్యోతి ఫిలిమ్స్ పతాక o పై పి. గంగాధర రావు నిర్మాణం చేసేడు.సి. ఎస్. రావు డైరెక్షన్ లో. ఈ సినిమా 1968 స లో విడుదల చేసేరు జ్యోతి ఫిలిమ్స్ ద్వారా.