ఇవాళ 6రోజుల్లో 38పీరియడ్స్ తెలుగు ఉపాధ్యాయులు బోధించాలి. ఇక సృజనాత్మకత ఎక్కడ ఉంటుంది?గత ప్రభుత్వం రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం నడుస్తోంది కాబట్టి మాతృభాష తెలుగుకు కనీస ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో గణితం, ఇంగ్లీష్ తరువాత SA(తెలుగు)ను కేటాయించాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మాత్రం 3వ ప్రాధాన్యత ఇవ్వడం కూడా Head Masters' Association కు నచ్చలేదట.వెంటనే సోషల్ స్టడీస్ వెయిటేజ్ తో పోల్చుతూ తెలుగు తరువాత సోషల్ స్టడీస్ టీచర్ ను ఇవ్వడం ఏమిటంటూ ఒక రిప్రజంటేషన్. పోనీ ప్రభుత్వం ఇచ్చిన వెయిటేజ్ టేబుల్ చూసారా అంటే అదీ లేదు.మరోవైపు విలీన పాఠశాలల్లో ఇద్దరు తెలుగు ఉపాధ్యాయులను ఇవ్వకుండా 4వ తరగతి తెలుగు ఇంగ్లీష్ మాస్టారు, 5వ తరగతి తెలుగు BS మాస్టారు బోధించాలి. కొన్ని స్కూల్స్ లో ఆ పని కూడా మీరే చేసేయండంటూ 4,5తరగతుల తెలుగు బోధనను ఉన్న ఒక్క తెలుగు మాస్టారు పై పడేస్తారు. ఇంగ్లీష్ మీడియం, సమాజం లో,సినిమా, రాజకీయాల్లో నడుస్తున్న దుడుకు భాష నేపథ్యంలో తెలుగు భాషా బోధన చాలా సంక్లిష్టమైనది.ఇక ఇంటర్మీడియట్ నుండి అక్షరమ్ముక్క రానోడంతా సంస్కృత పండితుడే.