Тёмный

పెసర సాగుతో మంచి ఫలితాలు || Good Results in M.G.G - 295 Green gram farming || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 436 тыс.
Просмотров 53 тыс.
50% 1

Good Results in Green gram cultivation || Best Green gram Varieties for Summer
High yields Green gram Variety MGG - 295.
పెసర సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్న రైతులు
ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోను అతి తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలో చేతికొచ్చే పప్పుజాతి పంట పెసర. పల్లాకు తెగులును తట్టుకుని, అధిక దిగుబడినిచ్చే రకాల అందుబాటుతో ఈ పంట రైతుకు లాభాలు పండిస్తోంది. డిసెంబరు రెండవ పక్షంలో అనుకోని విధంగా ఎమ్.జి.జి - 295 పెసర రకం సాగుచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు రైతు బాణాతి రవి. ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, వెంకట తండా గ్రామానికి చెందిన ఈ రైతు గత రబీలో మిరప సాగుచేసారు. అధిక వర్షాలు, చీడపీడల బెడదతో పైరు తీవ్రంగా దెబ్బతినటంతో వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనలు మేరకు పెసర సాగు చేసారు. అదే ఇప్పుడు ఈ రైతుకు అన్ని విధాలుగా కలిసి వచ్చింది. పైరు ఏపుగా పెరిగి ఎకరాకు 6 నుండి 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చే విధంగా పంట పండటంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్.జి.జి - రెండువందల తొంభై ఐదు పెసర రకం యొక్క పంటకాలం 60 నుండి 65 రోజులు. ఖరీఫ్ రబీ కాలాల్లో సాగుకు అనుకూలంగా వుంటుంది మొక్క నిటారుగా పెరుగుతుంది. కాపు పైభాగాన వుంటుంది. గింజ మధ్యస్థ లావులో వుండి సాదా రకంగా తెలంగాణలో అత్యంత ప్రాచుర్యంలో వుంది.
రైతు బాణాతి రవి పొలంలో ఈ పెసర రకం పూర్తిస్థాయిలో దిగుబడి సామర్ధ్యం కనబరచటంతో వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పెసర సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఇటీవల ఈ రైతు పొలంలో క్షేత్ర ప్రదర్శన ఏర్పాటుచేసారు. మిరప సాగులో నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతు రవికి పెసర పంట ఎకరాకు 30 వేల రూపాయల నికర లాభాన్ని అందించింది. ఇప్పుడు వేసవిలో కూడా ఈ పంట సాగుకు సిద్ధమవుతున్నారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. జె. హేమంత్ కుమార్ ఈ సందర్భంగా రైతుకు వేసవి పెసర సాగుకు తగిన సూచనలందించారు. పల్లాకు తెగులును తట్టుకునే ఎమ్.జి.జి - 351, ఎమ్.జి.జి - 347, డబ్ల్యూ.జి.జి - 42 రకాలను వేసవిలో సాగుకు ఎంచుకోవాలని, నీటి ఎద్దడి రాకుండా చూసుకుని, పైపాటుగా ఎరువులను పిచికారి రూపంలో అందిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
#karshakamitra #greengramcultivation #moongfarming
Facebook : mtouch.faceboo...

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 58   
Далее
Вопрос Ребром - Булкин
59:32
Просмотров 509 тыс.