అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ విశ్లేషణలో నేనే పాడి వినిపించాల్సి వచ్చింది. ముఖ్యంగా కాపీరైట్స్ సమస్యలు లేకుండా ఉండేందుకు. ఈ ప్రయత్నం మీద మీ అభిప్రాయం ఈ లింకు క్లిక్ చేసి పోల్ ద్వారా తెలియజేయగలరు: ru-vid.comUgkxRIcTT0JlP4EWvxWlgBzY0zR5mUq3dpNh
విద్వజ్జన విజానేతి గుర్వీం ప్రసవ వేదనాం 🙏ఆయన ఎంత తాత్వికతతో రాసారో అర్థం కావడానికి అంత విద్వత్తు ఉన్న మీలాంటి భాషాభిమానులు ఉండటం మా అదృష్టం. చాలా చాలా ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు 🙏 మరిన్ని ఇలాంటి వీడియోలు చేసి మమ్మల్ని ఉద్ధరించండి 🙏
పాటలు వినటానికి బాగున్నాయి అనుకున్నా, దానర్ధం తెలుసుకోనే లోపే ఒక జీవితం అయిపోతుందా అనిపిస్తుంది, ఇంత లోతుగా రచయిత ఎలా ఆలోచిస్తారు హ్యాట్సాఫ్ సిరి వెన్నెల గారు, మీరు లేకపోయినా మీ సాహిత్యంతో అమరుడు అయ్యారు... 🙏🙏🙏
మనం చిన్నతనంలో ఎవరికీ తెలియకుండా కనుక్కున్న ఒక మామిడి చెట్టు తీపి, మన బోటి వాడే ఇంకొకడు, ఈ చెట్టు అన్నిటిలా కాదు మహా తీపి, కానీ ఎవరికీ తెలియదు అని చెప్తే, అబ్బా భలే కనిపెట్టాడు అని ఒక రహస్యమైన ఆనందం, గర్వం ఈ వీడియో చూస్తే కలిగాయి. నేను ఒకే ఒక సారి సామవేదం షణ్ముఖశర్మ గారిని కలవగలిగాను. ఆయన సీతారామ శాస్త్రి గారి గురించి ఆయన శివ కవి / తాత్త్వికుడు అన్నారు. ఆ మాట మళ్ళీ మీ నోట విన్నాను. మీ నోట పాట బాగుంది. కోకిల నలుపు, మబ్బు మెరుపు ఇంకా బాగా explain చేసి ఉండచ్చు అనిపించింది. కోకిల నలుపు వల్లననే కాకి దాన్ని పెంచుతుంది. అదే కోకిల తెల్లగా ఉండి ఉంటే, గుడ్డు పొదిగి చూసిన కాకి ఇది నా బిడ్డ కాదు అని వదిలి వేసేది. కవి గుప్తంగా / అంతర్ముఖం తో ఉండి కేవలం తన కవిత్వాన్ని మాత్రమే వ్యాప్తి చెయ్యడం అనేది కోకిల దాక్కుని గానం చేయడానికి సూచన అని నా భావన. అలా ఉంటేనే పేరు మీద మనసు పోయి కవిత్వ మహత్తు మీద దృష్టి ఉంటుంది అని, అందుకు ఈ నలుపు అనేది ఒక ప్రతీక అని నా ఊహ. మేఘం యొక్క silver lining అన్న పోలిక బాగుంది. పూలు ఏ దినానికి ఆ దినం వాడి, రాలి పోతేనే వాటి తాజాదనం కి విలువ. అందుచేత వాటి ఆయువు అంతే ఉండాలి. బండ రాళ్ళు ఎల్లకాలం నిలిచి ఉంటేనే ఇన్ని శిల్పాలు, ఆలయాలూ, కోటలు నిలిచి ఉండేవి. అదే వాటి విలువ. ఈ పార్శ్వం కూడా ఇంకొంచెం విస్తారంగా ప్రస్తావించాలి అని నా కోరిక. కుదిరితే దీనికి ఒక పార్ట్ 2 వీడియో చెయ్యండి. ఇంకా ఇటువంటి మరిన్ని పాటలు, కబుర్లు చెప్పాలి. అభినందనలు. శివాకాంక్షలు❤
ఈ విషయంలో మనం మనం ఎప్పుడూ బరంపురమేనండీ! "ఆ రహస్యమైన ఆనందం, గర్వం" గురించి భలే చెప్పారు. సామవేదం గారు సిరివెన్నెలను శివకవి అని ప్రస్తావించారని మీ ద్వారా ఇప్పుడు తెలిసి అదే సంతోషం నాకు కలిగింది. ప్రత్యేకంగా ఆ ఉదాహరణలు ప్రస్తావించి వివరణలు చేయాలన్న ఆలోచన కూడా బావున్నది. పార్ట్ 2 గురించి ఆలోచిస్తా. ధన్యవాదాలు. (శివాకాంక్షలు అయితే అద్భుతః)
సీతారామశాస్త్రి గారు తన పాటలతో మనకు ఎన్నో నేర్పించారు అందులో ముఖ్యంగా ఆ భగవంతుని గాధ భాగవతమే మన బ్రతుకని చెబుతాడు... అన్నిటినీ లయం చేసుకునే యాచకుడిని ఏమి యాచిస్తావని అడుగుతాడు... మనలో నిత్యం జరిగే చర్యలను నివేదిస్తే అదే అమ్మవారికి చేసే పూజా అని చెప్తాడు... మనిషి జీవనం ఎంతవరకు ఎందుకొరకు అని మనల్ని ప్రశ్నిస్తాడు... మనలోని అష్టసిద్ధులని నువ్వు కనిపెట్టినప్పుడే నీవే అంతటా ఉండి నిండిపోయిన పరబ్రహ్మం అని అద్వైత తత్వాన్ని ప్రబోధిస్తాడు...
I am very late to this sir ji… Wonderfully explained 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఈ పాట మీరన్నట్టుగా పదాల్లో అలతిగా అనిపించినా భావం ఎంతో లోతు, శివుని లాగే! పైకి ధ్యానం చేసుకుంటూ కనిపించినా తనలో ఎంతో ఉంటుంది. “సిరివెన్నెల శివ కవి” మహాద్భుతమైన ఉపమానం. సరైన ఉపమానం. 😍
సంతోష్ గారు మాది చిన్న విన్నపం. K విశ్వనాథ్ గారి సినిమాలలో పాటలు, సాహిత్యం అద్భుతంగా వుంటాయి. కానీ ఆ సాహిత్యం సామాన్య అర్థం తెలియదు. కావున విశ్వనాథ్ గారి ప్రతి సినిమాలలో పాటలకు సాహిత్యం అర్థం చెప్పగలరు.
Shila neveee silpam nevee song analysis and explanation please. Song from jayaraj Anna and vijay yesudas Thank you I loved the analysis for krishnam vendee jagad gurum song. Which motivated me send this message.
ఒక్క సామాన్యుడిగానే.. చాలా చక్కగా వివరించాసారు అన్న.. ఇంకా యెనో పాటలు యొక్క సాహిత్య వివరణ ముందు ముందు కుడా మీ నుంచి వస్తాయని ఆశిస్తూ.. మీ యొక్క అభిమానిని.
I have been trying for "ksheerasaagara madhanam" by sirivennela seetharama sastry. I could find it. Can you please provide me with the information of its whereabouts. Thank you
Hi santosh how r u. Okka kshanam voice vini mana Santosh emo anukunnaa, mallee thanu endhuku avuthaadu le anukunnaa. Vedio madhyalo pavan Santosh anagaane mind black aindhi. Sorry gurthu pattalekapoyinandhuku. Chalaa happy ga undhi ninnu choosinandhuku. Well done, keep it up.
@@GyanBulb I’m good Santosh. Happy to see u again X. Vedios continue chey, endhuku aapesaavu. Underrated channel I think so. Don’t get disappointed. We’re r u now, in TPG only?
Reason for my comment is "nootiki tombayi mandiki telidu ee paata antharardham annaru" adantha meeku anavaram kada,.meeremi ardam.chesukunnaro adi cheppandi chaalu, you no need to judge people and come to the point without wasting 5 mn with the boring upodghaatam to reach more viewers.
@@CatWorld_101 మీ అభిప్రాయానికి ధన్యవాదాలండీ. 1. విషయం త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మంచి సూచన. 2. ప్రేక్షకులను తక్కువ చేయటానికి వాడిన మాట కాదది. సామాన్యంగా "మీకు తెలియదు" అన్న టోన్‌లో నా థంబ్‌నైల్స్ కానీ, కామెంట్స్ కానీ ఉండవు. కానీ ఇక్కడ నిందాస్తుతిలో నింద అర్థమవుతుంది, స్తుతి అర్థం కాదు. నేను ఎంతోకాలంగా చూస్తున్నాను. ఈ పాటను వ్యాఖ్యానించి మాట్లాడినప్పుడు చాలామంది మిత్రులు నిందకు ఇచ్చిన ప్రాధాన్యత స్తుతికి ఇవ్వరు. అందువల్ల ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్‌గా ఆ మాట అన్నానే తప్ప మరేమీ కాదు. బహుశా ఆ మాట అనకపోయి ఉండాల్సింది. థాంక్యూ.
Thanks for invitation andi! Right now too occupied with my work and trying to take time out for Gyan Bulb. I hope we can collaborate sometime in future!