Тёмный

Anantapuram Famous Oliga | Rayalaseema Special Traditional Sweet | Anantapuram Oliga | Food Book 

Food Book
Подписаться 159 тыс.
Просмотров 285 тыс.
50% 1

స్వాగతం.. నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.
ప్రాచీన నేపథ్యం గల ప్రసిద్ధి చెందిన సంప్రదాయ తినుబండారం అనంతపురం ఓలిగ గూర్చి కార్యక్రమం చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను.
ఒలిగ శ్రీ కృష్ణ దేవరాయల వారి కాలం నాటి తినుబండారం గా తెలియవస్తుంది. రాయల వారి ఆస్థాన అష్ట దిగ్గజ కవులలో వకరైన ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన గారి ప్రబంధ కావ్యం మను చరిత్రలో భక్షము గూర్చి ప్రస్తావనే అందుకు నిదర్శనం.ఓలిగ ను రాయలసీమ లోని కొన్ని ప్రాంతాల్లో భక్షము లేక భక్షలు గా కూడా పిలుస్తారు.
రాయలేలిన సీమ రాయలసీమ లో రాయల కాలం నాటి తినుబండారమైన ఒలిగ కు ఇప్పటికి విశేష ఆదరణ లభిస్తోంది.
ముఖ్యంగా అనంతపురం వాసులు సంప్రదాయ తినుబండారం ఓలిగ పట్ల చూపతున్న మక్కువ అపారం. ఇస్తున్న గౌరవం అభినందనియం.
ఈ ప్రాంతంలో ఎ పండగైన, శుభకార్యామైన విందు విస్తరిలో తొలుత ఒలిగ వడ్డించడం ఆనవాయితీ.అలాగే ఓలిగ దైవరాధనలో నైవేద్యం కూడాను.
ఈ శుభ తరుణంలో అనంత నగరాన ఒలిగ తయారీ కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతూ ఏంతో మందికి జీవనోపాధి గా మారి ఉన్నతమై జీవితానికి మార్గం చూపింది.
నగరంలో యెక్కడ చూసిన ఒలిగ కేంద్రలు తరసుపడుతాయు.కమలా నగర్, పాతూరు తో పాటు అన్ని కలిపి షుమారు గా అనంతపురం లో 80కి పైగా ఒలిగ కేంద్రలు ఉండగా జిల్లా లో మొత్తం200 పైగా ఉన్నాయి.
రాయలసీమ ఒలిగ నుండి రూపుదాల్చినవే
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పురాన్ పోలి,బొబట్టు,ఉబ్బట్టి,వేద్మి తో పాటు అనేక పేర్లతో ఉన్న తినుబండారాలు. అయితే తయారీ ముడి పదార్థాలు, రుచి, పరిమాణం విషయంలో వాటికి ఓళిగకు
చాలా వ్యత్యాసం కలదు.తయారీ తీరు వకేలా ఉన్న వాటి తయారీలో ప్రాంతానికోవిధంగా రవ్వలను వినియోగిస్తున్నారు.అనంతపురంలో అనాదిగా పెనీ రవ్వతో మాత్రమే తయారు చేస్తారు.అంతిమంగా సహజ రుచి అనంతపురం ఓళిగకే సొంతం.
గతంలో పూర్ణం ఒలిగ మాత్రమే లభించేది. ఇప్పుడు కొబ్బరి,పాలకోవ,తోపాటు అనేక రకాల ఓలిగలు లభిస్తున్నాయి.ఇక్కడ నుండి దేశ, విదేశాలకు ఎగుమతి అవుతూ ఈ ప్రాంత ఖ్యాతిని నలుదిశలా చాటుతుంది ఓలిగ.
స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అనంతపురం ఓలిగ ను అమితంగా ఇష్టపడే వారు. కనుకనే వారి మనువడు తారక్ గారు తమ వివాహ విందులో అనంతపురం ఓలిగ ను వడ్డించారు.
అనంతపురం
పాతూరు లోగల కాంతమ్మ గారి ఓలిగ కేంద్రం లో కార్యక్రమం చిత్రీకరణ చేయడం జరిగింది. ఇక్కడ ఓలిగ తిన్న నేను పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను.కొబ్బరి ఓలిగ నాకు ఎంత గానో నచ్చింది.నేను ఇంటికి తెచ్చుకున్న తొలి ఆహార పదార్ధం ఓలిగ.
మీరు ఎప్పుడైనా అనంతపురం వెళ్తే ప్రసిద్ధి చెందిన ఓలిగ రుచి చూడండి. మీరు గొప్ప ,వైవిధ్యమైన రుచిని వ్యక్తం చేస్తారు.
#AnantapuramOliga #RayalaseemaTraditionalSweet
#Food Book
Music Credit:-
Jalandhar by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 license. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 282   
Далее
Best Chicken And Mutton Kebabs | Kurnool Talkies
6:41
Пришёл к другу на ночёвку 😂
01:00
Пришёл к другу на ночёвку 😂
01:00