Anthayu Neeve Hari Pundareekaksha -Annamcharya Keerthana | అంతయు నీవే హరి పుండరీకాక్ష - అన్నమాచార్య కీర్తన
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంత నాకు నీవే శ్రీరఘురామ
కులమును నీవే గోవిందుడా
నా కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర
నా నెలవును నీవే నీరజనాభ
తనువును నీవే దామోదర
నా మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విట్ఠలుడా
నా వెనకముందు నీవే విష్ణు దేవుడా
పుట్టుగు నీవే పురుషోత్తమ
కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా
నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే
Raagam: Hindolam
Lyricist: Srimaan Taallapaaka Annmacharyulu
Varu
Music and singer: Srimaan Garimella Balakrishna
Prasad garu
23 сен 2024