ఘంటసాల మాస్టారు గానం, సంగీత దర్శకత్వం అనితర సాధ్యం. సుబ్రహ్మణ్యం ఘంటసాల గారిని ఎపుడూ మనస్ఫూర్తిగా పోగడలేదు... గౌరవించ లేదు. ఈ వీడియోలో కూడా అంతే. పోగుతున్నట్టే మాట్లాడుతూ ఆయనను కించపరుస్తూ మాట్లాడటం చాలా చూసాను.
గాన గంధర్వులు ఘంటసాల మాస్టారి గురించి లెజెండ్స్ చెప్పిన అభిప్రాయాలతో కూడిన వీడియో చాలా బాగుంది. యాంకర్ స్వచ్ఛమైన తెలుగుతో ఘంటసాల మాస్టారి గురించి చెప్పే విధానం బాగుంది.
చాలా మంది మంచి మంచి గాయకులు పుట్టారు ఇక మీదట కూడా పుడతుండ వచ్చు కానీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి లాంటి గాయకుడు మాత్రం పుట్టడం అసాధ్యం అనితర సాధ్యం. పాట కోసమే దేవుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని పుట్టించాడు. తెలుగు పాట అదృష్టం చేసుకుంది.తెలుగు భాష పైన అంత పట్టు వున్న గాయకులూ ఎవరుంటారు.
వాఖ్యాత - ఘంటసాల మీద ఒక మంచి డాక్యుమెంటరీకి వ్యాఖ్యానం చేసే అదృష్టాన్ని పొందారు. ఘంటసాల గారు తన పాటల, పద్యాల ఉచ్చారణ లో వత్తులకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు.ఈనాటి వాఖ్యాతలు చాలామంది లా కాకుండా మీరు వత్తులు బాగా పలికారు. వారి ఆత్మ చాలా సంతోషించి ఉంటుంది.
God’s gift to the Telugu people.He was and still is part of our lives .The greatest singer and one of the greatest music directors of Telugu cinema he and his song will eternally live in our memories as long as we r alive.
Ghantasala is Lord Venkateswara Swamy s Asthana Gayakudu.Lord wanted in His Presence and galloped him leaving us in the present Hell of these beats,rocksetc.
మీ వ్యాఖ్యానం లో ఒక సంగతి బాగా నచ్చింది. ఘంటసాల తన సృష్టి అయినందుకు ఆ భగవంతుడైనా గర్వ పడాల్సిందే. నిజమే. అప్పటి వరకు ఆయనకు reference కోసం అంత మధుర గాత్రానికి ఒక ప్రామాణికం లేదుగా!
భారతదేశం లో ఒక వర్గీయులు, వారు తానా అంటే, ఏ మాత్రమూ విశ్లేషణ చేసుకోకుండా తందానా అనే మరొక అధిక వర్గీయులు కూడా ఇప్పుడు, అప్పటి ఒక హిందీ గాయకుణ్ణే God's voice, khuda ka awaz అంటుంటారు. SPB అభిప్రాయమూ అదే అన్నట్టుండేవి ఆయన మాటలు. సోలోస్, డ్యూయట్స్ వంటివి ఘంటసాల స్థాయిలో హిందీవంటి ఇతర భాషల్లోనూ కొందరు పాడినా, భక్తి, క్లాసికల్స్ విషయంలో ఆయనతో ఏ ఒక్క ఇతర గాయకుడూ సరికాడు. రాజ్యాంగంలో హిందీతో సహా ఎన్నో భాషలు సమ ప్రాధాన్యత కలిగియున్నప్పటికీ, ఘంటసాలకు దేశవ్యాప్త గుర్తింపు రాకపోవడం మన దురదృష్టం. శివశంకరీ పాటను ప్రేరణగా తీసుకొని, తరవాత 5-6 సం లకు శంకర్ జైకిషన్ కూర్చి, మన్నాడే తో పాడించిన " ఝనక్ ఝనక్ తోరే బాజే పాయలియా " పాటకు గానూ మన్నాడేకు రాష్ట్రపతి పురస్కారం లభించిందని చదివినాను. మరి, అంతకంటే ఎంతో అద్భుతంగా పాడిన ఘంటసాల కో?
ఘంటసాల మాస్టారు గారి గురించి సినిమా బయటి వారు మాట్లాడలే రా ? ఎవరు లెజండ్ లు.. ? ఇంకా నయం అందరినీ " గంధర్వ గాయకులు " ఆనలేదు..సుశీల గారు శాస్త్రీయ సంగీతం నేర్చు కొన్నారు. ఆవిడ చెబితే బావుంటుంది..