2nd part kuda ఉండవచ్చుబహుశా. దయచేసి అదికూడా ప్రసారం చేయగలరు. ధన్యవాదములు దీన్ని వినిపించినందుకు.నాచిన్నపుడు రేడియో లో కొంచెం విన్నగుర్తు. అపుడు తెలియలేదు.
ఇదేమి హాస్య నాటకం బాబోయ్...ఒక మనిషి కాస్త పొట్టిగా, నల్లగా, అంగ వైకల్యం తో పుడితే ఇక అతన్ని మనిషిగా గుర్తించ రా??! అతన్ని కోతి అని, కొండ ముచ్చు , ఎలుగు బంటి అని పేర్లు పె ట్టి మొరటు హాస్యం సృష్టిస్తా రా? ఇదేమి హాస్య రచన దేవుడా? పుట్టుక లో సహజమైన లోపాలను అర్థం చేసుకోకుండా బండగా, insensitive గా వేళాకోళం చేసి నవ్వు తెప్పిస్తా రా!? పైగా అది ఉత్తమ రచన అని పోగుడుతారా? చిలకమర్తి నాటి రోజుల్లో ఇదే హాస్యంగా చెలామణి అయినందుకు , వారికి శతకోటి వందనాలు, ఈ నాటకం ఇప్పటికీ సాటి లేని దని భావించే వారికి యెనలేని అభినందనలు...ఇంకో మాట , ఇందులో గణపతి తల్లిని ఊరి వారు తిట్టే తిట్లు మరో మొరటు భాష, ఒక పల్లెటూరి అమాయక స్త్రీని .. ముం డా, దండు లాంటి పదాలతో అనేక సార్లు నిందిస్తారు, ఇదా హాస్య మంటే?!సాక్షాత్తు ఆమె కొడుకు అంటే గణప తే తన తల్లిని అమాయకపు గొంతుతో ఇలా తిట్టి పోస్తాడు, అందుకు మనం మనసారా నవ్వు కోవాలి!గయోపాఖ్యానం , ప్రహసనాలు వంటి చిలక మర్థి రచనలు, వారి సంఘ సంస్కరణ ఆశయం గొప్పవే కావచ్చు గానీ, గణపతి నాటకం ఈరోజుల్లో నే కాదు, అంతగా చదువులు లేని ఆరోజుల్లో కూడా ఏమి సందేశం ఇచ్చిన creative writing కానేరదు, కాబట్టి ఈ నాటకం విని వేస్ట్, కాలం వృధా తప్ప... 🙏🙏ఈ రోజుల్లో ఇలాంటి రచనలు ఇలాంటి కంటక మైన భాష తో వస్తె అంగీ కరిస్తా మా?పైగా, ఇందులో సాహితీ బంగారం కనబడుతోంది అని అంటారు, కళా ఖండం అట...ఖర్మ 🙏