పల్లవి: గుండెకి సవ్వడెందుకో పెదవులకి వణుకెందుకో గుండెకి సవ్వడెందుకో పెదవులకి వణుకెందుకో పరువానికి పరుగెందుకో తనువుకి తపనెందుకో గుండెకి సవ్వడెందుకో పెదవులకి వణుకెందుకో పరువానికి పరుగెందుకో తనువుకి తపనెందుకో ఏమిటీ కొత్త వింత మదిలో ఏదో పులకింత అర్థం కాని కవ్వింత ఆశల గిలిగింత ఇదేనేమో ప్రేమ నవ యవ్వన సీమ ఇదే సుమా ప్రేమ ఆ మదనుడి మహిమ గుండెకి సవ్వడెందుకో పెదవులకి వణుకెందుకో పరువానికి పరుగెందుకో తనువుకి తపనెందుకో చరణం:1 ఇది తొలి తొలి వలపుల తొలకరి ధ్వని తొలకరి ధ్వని................ తపనకు తరగని గని తలపుల రాజధాని ఇది తొలి తొలి వలపుల తొలకరి ధ్వని తపనకు తరగని గని తలపుల రాజధాని అడగకు ఇది ఏమని అంతరంగానికిదే ఆమని అనంత జీవన వాహిని అద్భుతాలందామని ఇది కమ్మని యామిని జన సమ్మోహిని జగతికి వరదాయినీ.......... ఇదే ఇదే ప్రేమ నవ యవ్వన సీమ ఇదే సుమా ప్రేమ ఆ మదనుడి మహిమ గుండెకి సవ్వడెందుకో పెదవులకి వణుకెందుకో పరువానికి పరుగెందుకో తనువుకి తపనెందుకో చరణం:2 ఇది వయస్సు చేసే తలపుల తపస్సు ఎద ఎదను పండించే ఎర్రని తేజస్సు ఇది వయస్సు చేసే తలపుల తపస్సు ఎద ఎదను పండించే ఎర్రని తేజస్సు ఇది మదిలో వెల్లివిరిసే ఇంద్రధనుస్సు మనసుకి పరమార్థమిచ్చే మధుర ఉషస్సు ఇది యవ్వన యశస్సు ఆశల ఆశీస్సు దీనికో నమస్సు................ ఇదే ఇదే ప్రేమ నవ యవ్వన సీమ ఇదే సుమా ప్రేమ ఆ మదనుడి మహిమ గుండెకి సవ్వడందుకే పెదవులకి వణుకందుకే గుండెకి సవ్వడందుకే పెదవులకి వణుకందుకే పరువానికి పరుగందుకే తనువుకి తపనందుకే పరువానికి పరుగందుకే తనువుకి తపనందుకే ఇదే ఇదే ప్రేమ నవ యవ్వన సీమ ఇదే సుమా ప్రేమ ఆ మదనుడి మహిమ ల....ల....ల....ల....ల....ల....ల....ల.... ల....ల....ల....ల....ల....ల....ల....ల.... ల....ల....ల....ల....ల....ల....ల....ల.... సీరియల్:అంతరంగాలు నటీనటులు:అశ్వని,శరత్ బాబు Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800. (ఈటీవి ఛానల్ 25వ వార్షికోత్సవం) 28/08/2020.
@@shaikshafia5881 గారు ధన్యవాదాలు. చిన్నప్పుడు అంతరంగాలు,కళంకిత, లేడీ డిటెక్టివ్, స్నేహ, విధి ఇలా ఎన్నో ఈటీవి తెలుగు సీరియల్స్ పాటలు ఇష్టంగా వినేవాణ్ణి.ఆ పాటలు వింటుంటే ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతాయి. స్వీట్ మెమోరీస్