కరకరలాడే పై భాగం...లోపల ఉండే మెత్తని "మషాలా ఆలూ ముద్ద" కలిసి తినేవారికి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది... (ఇరుగింటి పొరుగింటి వారి మధ్య ఆసక్తిదాయకంగా మంచి సంభాషణ జరగడానికి ఈ పటేటో రోల్స్ బాగా పనికివస్తాయి)
"పటేటో రోల్స్ " చాలా రుచికరమైనవి ... రుచులకు వయసుతో సంబంధంలేదు...పిల్లలు పెద్దలకు "పటేటో రోల్స్" అనుకున్న దానికంటే ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి....2 సంవత్సరాల పిల్లలు మొదలుకొని 112 సంవత్సరాల వృద్ధులు కూడా దీని రుచిని సంతోషంగా ఆస్వాదించవచ్చు!
చదువు, ఆట, పాటలతో అలసిపోయే పిల్లలకు ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టడం వల్ల అల్లరి చెయ్యడం మాని, ప్రశాంతంగా ఈ పటేటో రోల్స్ తింటూ,ఇంకా కావాలని అడుగుతూ కడుపునిండేవరకు తిని సంతోషంగా చెప్పిన మాట వింటారు....మంచి పిల్లలుగా మారతారు!అందువల్ల పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు, మంచి రుచికరమైన ఆహారం కూడా అవసరం!