Тёмный

MOKKARO MOKKARO MEERU /మొక్కరో మొక్కరో మీరు / AAV SERIES 06 EP 511 / K RAMACHARY /K SAKETH /VASANTHA 

YVG ANNAMAYYA AKSHARA VEDAM
Подписаться 13 тыс.
Просмотров 510
50% 1

మొక్కరో మొక్కరో మీరు ..
తాళ్లపాక అన్నమాచార్య శృంగార సంకీర్తన
రాగము:-- సాళంగనాట
రేకు: 0351-4 సంపుటము: 11-304
స్వరకర్త ః-- కొమండూరి రామాచారి గారు
రాగము ః-- వసంత
గానము ః- కొమండూరి సాకేత్ గారు
🌹🌹 సంకీర్తన 🌹🌹
॥పల్లవి॥
మొక్కరో మొక్కరో మీరు మోమునఁ గళలు దేరె
యెక్కువ శ్రీవెంకటేశుఁ డింతులలో వాఁడె
॥చ1॥
తేరుమీఁద నెక్కీ హరి దేవుళ్లుఁ దానును వాఁడె
భోరునను దేవదుందుభలు వాఁగగా
తోరపుమోఁకులు వట్టి దొరలు బ్రహ్మదు లెల్ల
ధీరతఁ దీశే రదే తిరువీధులందును
॥చ2॥
వేడుక రథముమీఁద వెలసే శ్రీపతివొద్ద
ఆడేరు పాడేరు అచ్చర లెల్ల
నీడెపు సెలవులతో వెలఁదులతో హరి
యీడు లేక యేఁగి వచ్చీ నింటింటి వాకిటను
॥చ3॥
శ్రీవెంకటేశుఁడు వాఁడె చేరి యలమేలుమంగ
సావధానమున సరసము లాడఁగ
దేవాసనం బెక్కి తేఁకువ నారగింపులు
వావిరిఁ జేకొనీ వాఁడె వాడవాడలను
🌺🍃 -----------🍃🌺
అన్నమయ్య అక్షరవేదం సంపుటి -- 511
( మొక్కరో మొక్కరో మీరు .. )
🌺🍃 ----------- 🍃🌺
ఓం నమో వేంకటేశాయ. 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 511 కి శుభ స్వాగతం ..🙏
ప్రార్థన ః--🌹🙏
సురల నరుల సాక్షిగ నా
తిరువీధులన మలయప్ప తేరు , కుదురుగా,
గరిమన పరగీనదిగో !
వరముగ వేరేమి వలనె ? వడిశరణనరో !
🌹🙏🌹
✍️ --స్వీయపద్యము ( కందము )
🌹🌹
ఆ బ్రహ్మదేవుడే దిగివచ్చి వినమ్రముగా ఈ రథమును నడిపించుచున్నాడు గాన ,
సకల దేవతలు ఇక్కడే ఉన్నారు ,భక్తకోటి అంతా ఇక్కడే ఎదుటనే ఉన్నది ! 🙏
వారందరూ వీక్షించుచుండగా , అదిగో మలయప్ప స్వామి రథము , నిదానముగా , చెప్పరాని వైభవముతో , తిరుమలవీధులనన్నిటా వ్యాపించి కదులుచున్నది ! 🙏
ఓ భక్తజనులారా ! మన జీవితాలకు వేరే గొప్పనైన వరము ఇంకా ఏమైనా కావాలా చెప్పండి ?
ఆ రథమును , ఆ రథారూడుని వీక్షించి వేగిరమే అతనికి శరణంబని ఆనందముగా ఉందాము రండి ! 🙏
అట్టి దివ్యమైన రథమునకు సదా మంగళములు !🙏
🌺🍃 -----------🍃🌺
మున్నుడి ః-- 🌹👇
అన్నమాచార్యుల వారు స్వామివారి రథముపై ,అలాగే రథారూఢుడైన స్వామిపై చాలా సంకీర్తనలనే రచించారు .🙏
నిజానికి తేరుపై తిరుమాడ వీధులలో దేవేరులతో కూడి తిరుగాఉచున్న స్వామిని చూచుటకు వేయి కన్నులు సరిపోవు .🙏
అటువంటి స్వామిని తన సంకీర్తనతో చూపిస్తున్నారు అన్నమయ్య .
మరి ఈ చక్కని కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
🌺🍃 ----------- 🍃🌺
🌹🌹
ఓ భక్తజనులారో అదిగో మొక్కండి ! మరల మరల మొక్కుకోండి .
తన వదనారవిందము గొప్ప గొప్ప కళలతో శోభిల్లుచుండగా , తన దేవేరులతో కూడి అదిగో వాడే ! 🙏
అతడే సర్వోన్నతుడైన శ్రీ వేంకటేశ్వరుడు అని భావించుకుని మొక్కండి .🙏
🌹🌹
అదిగో ఆ రథముపై ఎక్కి శ్రీహరి విలాసముగా తన దేవురలతో కూర్చుని యున్నాడు .
అనేకమైన మంగళ వాయిద్యముల హోరు తో ఆ రథప్రాంగణమంతా మారుమ్రోగిపోతోంది .🙏
ఆ రథానికి కట్టి ఉన్న బలిష్టమైన , పొడవైన పెద్దపెద్ద తాళ్లను , బ్రహ్మతో సహా దేవతలు , రాజులు , శ్రేష్ఠులైన వారు , ఇంకా అందరూ కలసి , నిబ్బరముగా ముందుకు లాగుచున్నారు .🙏
🌹🌹
వేడుకగా ఆ రథముపై కొలువై యున్న శ్రీ మహాలక్ష్మీ పతి చెంతన , అప్సరో గణమంతా చేరి గానములు చేయుచు నాట్యమాడుచున్నారు ఆనందముగా !🙏
తాంబూలము వేసుకున్న అందమైన పెదవులతో చిరునవ్వులు చిందించుచు , తన సతులతో కూడి ,
నిత్యయౌవ్వనుడివలె ,శ్రీహరి ఆ రథముపై ఊరేగుతూ ,
తానే ఇంటింటికీ వచ్చి అనుగ్రహించుచున్నాడు .🙏
🌹🌹
అదిగో అతడే శ్రీ వేంకటేశ్వరుడు .
జాగ్రత్తగా ఆయనవద్దకు చేరి అలమేలుమంగమ్మ,
తగునైన మాటలతో సరసములాడుచున్నది .🙏
ఆ రథముపై , దివ్యమైన ఆసనముపై కూర్చుని ,
నివేదించినవి అన్నీ ఆనందముగా ఆరగించుచు ,
తిరుమాడ వీధులలో క్రమముగా , ఊరేగుచున్నాడు తనకు తానే వచ్చి అందరినీ అనుగ్రహించుచు .🙏
🌹🙏🌹
ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 7   
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 4 дня назад
మొక్కరో మొక్కరో మీరు .. తాళ్లపాక అన్నమాచార్య శృంగార సంకీర్తన రాగము:-- సాళంగనాట రేకు: 0351-4 సంపుటము: 11-304 స్వరకర్త ః-- కొమండూరి రామాచారి గారు రాగము ః-- వసంత గానము ః- కొమండూరి సాకేత్ గారు 🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ మొక్కరో మొక్కరో మీరు మోమునఁ గళలు దేరె యెక్కువ శ్రీవెంకటేశుఁ డింతులలో వాఁడె ॥చ1॥ తేరుమీఁద నెక్కీ హరి దేవుళ్లుఁ దానును వాఁడె భోరునను దేవదుందుభలు వాఁగగా తోరపుమోఁకులు వట్టి దొరలు బ్రహ్మదు లెల్ల ధీరతఁ దీశే రదే తిరువీధులందును ॥చ2॥ వేడుక రథముమీఁద వెలసే శ్రీపతివొద్ద ఆడేరు పాడేరు అచ్చర లెల్ల నీడెపు సెలవులతో వెలఁదులతో హరి యీడు లేక యేఁగి వచ్చీ నింటింటి వాకిటను ॥చ3॥ శ్రీవెంకటేశుఁడు వాఁడె చేరి యలమేలుమంగ సావధానమున సరసము లాడఁగ దేవాసనం బెక్కి తేఁకువ నారగింపులు వావిరిఁ జేకొనీ వాఁడె వాడవాడలను 🌺🍃 -----------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం సంపుటి -- 511 ( మొక్కరో మొక్కరో మీరు .. ) 🌺🍃 ----------- 🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 511 కి శుభ స్వాగతం ..🙏 ప్రార్థన ః--🌹🙏 సురల నరుల సాక్షిగ నా తిరువీధులన మలయప్ప తేరు , కుదురుగా, గరిమన పరగీనదిగో ! వరముగ వేరేమి వలనె ? వడిశరణనరో ! 🌹🙏🌹 ✍ --స్వీయపద్యము ( కందము ) 🌹🌹 ఆ బ్రహ్మదేవుడే దిగివచ్చి వినమ్రముగా ఈ రథమును నడిపించుచున్నాడు గాన , సకల దేవతలు ఇక్కడే ఉన్నారు ,భక్తకోటి అంతా ఇక్కడే ఎదుటనే ఉన్నది ! 🙏 వారందరూ వీక్షించుచుండగా , అదిగో మలయప్ప స్వామి రథము , నిదానముగా , చెప్పరాని వైభవముతో , తిరుమలవీధులనన్నిటా వ్యాపించి కదులుచున్నది ! 🙏 ఓ భక్తజనులారా ! మన జీవితాలకు వేరే గొప్పనైన వరము ఇంకా ఏమైనా కావాలా చెప్పండి ? ఆ రథమును , ఆ రథారూడుని వీక్షించి వేగిరమే అతనికి శరణంబని ఆనందముగా ఉందాము రండి ! 🙏 అట్టి దివ్యమైన రథమునకు సదా మంగళములు !🙏 🌺🍃 -----------🍃🌺 మున్నుడి ః-- 🌹👇 అన్నమాచార్యుల వారు స్వామివారి రథముపై ,అలాగే రథారూఢుడైన స్వామిపై చాలా సంకీర్తనలనే రచించారు .🙏 నిజానికి తేరుపై తిరుమాడ వీధులలో దేవేరులతో కూడి తిరుగాఉచున్న స్వామిని చూచుటకు వేయి కన్నులు సరిపోవు .🙏 అటువంటి స్వామిని తన సంకీర్తనతో చూపిస్తున్నారు అన్నమయ్య . మరి ఈ చక్కని కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇 🌺🍃 ----------- 🍃🌺 🌹🌹 ఓ భక్తజనులారో అదిగో మొక్కండి ! మరల మరల మొక్కుకోండి . తన వదనారవిందము గొప్ప గొప్ప కళలతో శోభిల్లుచుండగా , తన దేవేరులతో కూడి అదిగో వాడే ! 🙏 అతడే సర్వోన్నతుడైన శ్రీ వేంకటేశ్వరుడు అని భావించుకుని మొక్కండి .🙏 🌹🌹 అదిగో ఆ రథముపై ఎక్కి శ్రీహరి విలాసముగా తన దేవురలతో కూర్చుని యున్నాడు . అనేకమైన మంగళ వాయిద్యముల హోరు తో ఆ రథప్రాంగణమంతా మారుమ్రోగిపోతోంది .🙏 ఆ రథానికి కట్టి ఉన్న బలిష్టమైన , పొడవైన పెద్దపెద్ద తాళ్లను , బ్రహ్మతో సహా దేవతలు , రాజులు , శ్రేష్ఠులైన వారు , ఇంకా అందరూ కలసి , నిబ్బరముగా ముందుకు లాగుచున్నారు .🙏 🌹🌹 వేడుకగా ఆ రథముపై కొలువై యున్న శ్రీ మహాలక్ష్మీ పతి చెంతన , అప్సరో గణమంతా చేరి గానములు చేయుచు నాట్యమాడుచున్నారు ఆనందముగా !🙏 తాంబూలము వేసుకున్న అందమైన పెదవులతో చిరునవ్వులు చిందించుచు , తన సతులతో కూడి , నిత్యయౌవ్వనుడివలె ,శ్రీహరి ఆ రథముపై ఊరేగుతూ , తానే ఇంటింటికీ వచ్చి అనుగ్రహించుచున్నాడు .🙏 🌹🌹 అదిగో అతడే శ్రీ వేంకటేశ్వరుడు . జాగ్రత్తగా ఆయనవద్దకు చేరి అలమేలుమంగమ్మ, తగునైన మాటలతో సరసములాడుచున్నది .🙏 ఆ రథముపై , దివ్యమైన ఆసనముపై కూర్చుని , నివేదించినవి అన్నీ ఆనందముగా ఆరగించుచు , తిరుమాడ వీధులలో క్రమముగా , ఊరేగుచున్నాడు తనకు తానే వచ్చి అందరినీ అనుగ్రహించుచు .🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 4 дня назад
Om Namo Venkatesaya🙏🙏🙏 excellent Sankeertana; Rathotsavam adbhutamga present Chesaru; radhamulu; Srivaru ammavarula Darshanam chala Chakka ayinadhi; Sri Venugopal Garu, thank you so much; very nice own padhyamu; and ardhamu vivarana Abhinandanalu🙏 excellent Gaanamu by K Saketh garu; om Sri Alamelu Manga Sri Venkatesh Swaminey Namaha🙏🙏🙏 bless you
@VsvlsraoAyithy
@VsvlsraoAyithy 3 дня назад
0m namo venkatesaya Govinda Govinda namaste
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 4 дня назад
🌺☘ -----------☘🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 511 ( MOKKARO MOKKARO MEERU ..) 🌺☘ -----------☘🌺 PREFACE :-- 🌹👇 Annamacharya has written many keertanas praising the Chariot of the Lord , and The Lord Going As a procession upon the chariot too .🙏 In fact, a thousand eyes are not enough to see the Lord roaming on the streets of Tirumala along with his consorts.🙏 Here goes the interesting keertana as below 👇 🌺☘ -----------☘🌺 🌹🌹 Oh Dear Fellow men Pay Your Obeisances ! Pay Your Obeisances !🙏 Here He Is ! The Lord Delightfully , With A Pleasant Face The Exceedingly Great Lord Sri Venkateswara Is There Inside Along With His Consorts🙏 🌹🌹 Boarded Upon The Chariot There He Is , The Lord Sri Hari Along With His Consorts 🙏 Along With The Auspicious Rumbling Sounds of Drums And Clarionets🙏 By Holding The Long Strong & Thick Ropes Of The Divine Chariot Lord Brahma , The Kings And All The Great People With Great Endurance🙏 They All Are Pulling The Chariot On The Streets Of Tirumala !🙏 🌹🌹 Nearby To The Lord Of Sri Maha Lakshmi , Who Is Witnessing All The Celebrations Seated On The Chariot , All The Heavenly Damsels Are Merrily Singing And Dancing in Delight !🙏 With Lovely Lips After Eating Betel Leaf Pan and Showering Smiles Along With His Consorts The Lord Sri Hari As An Ever Youthful Lord , He Himself Is Coming And Gracing Every House from The Chariot !🙏 🌹🌹 He Is That Lord Sri Venkateswara Whom Mother Alamelumanga Approaches , being attentive with The Lord , And have Lovely Witty Talks !🙏 Seated On The Royal Divine Throne bloomingly , He Is Accepting All Offerrings , excessively in a Great order along Every street of Tirumala !🙏 🌹🙏🌹 Om Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha !🙏 🌹🙏🌹 ✍ --Venu Gopal
@SiddavatamThirupathiredd-ne7uw
Govindaa govindaa govindaa
@padmaiyengar5387
@padmaiyengar5387 4 дня назад
🙏🙏🙏
@parvateesamvepa6303
@parvateesamvepa6303 3 дня назад
వేణుగోపాల్ గారూ..మీకు అనేక అభినందనలండీ.. వసంత రాగంలో శ్రీ కొమండూరి.రామాచారి గారు స్వర కల్పన చేయగా శ్రీ కొమండూరి. సాకేత్ గారు గానము చేసిన యీ అన్నమయ్య సంకీర్తనకు మీరు చక్కని కంద పద్యము రచించి అందలి భావమును యెంతో అందంగా నాలుగు పాదాలందు అలరింప చేసేరు. వసంత రాగంలో కీర్తన,స్వర రచన, గానములు అపురూపమైనవి. మీరు రచించిన ఆంధ్ర, ఆంగ్ల వ్యాఖ్యానములు చాలా భావాత్మకమై భవ్యముగా ప్రకాశిస్తూ ఉన్నవి. మీ వ్యాఖ్యానము వల్ల భక్తి అనుభూతి పొందే అవకాశం అధికంగా కలిగించేరు. సంబంధిత చిత్రాలతో వ్యాఖ్యానంతో మీ ఎడిటింగ్ మనోహరమైన రీతిలో చిత్రించారు. మీకు,మీ బృందంలోని సభ్యులందరకూ అనేకానేక అభినందనలండీ. ఓం నమో శ్రీ వేంకటేశాయ మంగళమ్ 🌹🙏🙏🙏🙏🙏🌹
Далее
Wildest 10 SECONDS OF HIS LIFE 🤯 @TomIsted
00:14
Просмотров 1,1 млн