Тёмный

NEEVEKA CHEPPA CHOOPA / నీవేకా చెప్పజూప / AAV SERIES 06 EP 503 /SALURI VASURAO/PAVAN CHARAN /KALYANI 

YVG ANNAMAYYA AKSHARA VEDAM
Подписаться 13 тыс.
Просмотров 453
50% 1

నీవేకా చెప్పజూప నీవె నీవెకా..
🌹🌹-----------------🌹🌹
తాళ్లపాక అన్నమాచార్య ఆధ్యాత్మ సంకీర్తన
రాగము: లలిత
రేకు: 0042-01 సంపుటము: 1-255
స్వరకర్త ః-- శ్రీ సాలూరి వాసూ రావు గారు
రాగము ః-- కళ్యాణి
గానము ః- శ్రీ వవన్ చరణ్
🌹🌹 సంకీర్తన 🌹🌹
॥పల్లవి॥
నీవేకా చెప్పఁజూప నీవె నీవెకా
శ్రీ విభుప్రతినిధివి సేన మొదలారి
॥చ1॥
నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద
దేవతలఁ గనిపించే దేవుఁడవు
యేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజ-
సేవకుఁడవు నీవెకా సేనమొదలారి
॥చ2॥
పసిఁడి బద్దలవారు పదిగోట్లు గొలువ
దెసలఁ బంపులువంపే దీరుఁడవు
వసముగా ముజ్జగాలవారి నిందరిని నీ-
సిసువులఁగా నేలిన సేనమొదలారి
॥చ3॥
దొరలైన యసురుల తుత్తుమురు సేసి జగ-
మిరవుగా నేలితి వేకరాజ్యమై
పరగుసూత్రవతీ పతివై వేంకటవిభు-
సిరుల పెన్నిధి నీవే సేనమొదలారి
🌺🍃 ----------🍃🌺
అన్నమయ్య అక్షరవేదం సంపుటి -- 503
( నీవేకా చెప్పజూప నీవె నీవెకా )
🌺🍃 ----------- 🍃🌺
ఓం నమో వేంకటేశాయ. 🙏
అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 503 కి శుభ స్వాగతం ..🙏
ప్రార్థన ః--🌹🙏
నారాయణు సేనాపతి
దారులనన్నిటిని జూడ దానరుదెంచెన్,
వారే విష్వక్సేనులు,
చేరికొలువ నతడె జయముశివముల నొసగున్ !
🌹🙏🌹
✍️ --స్వీయపద్యము ( కందము )
🌹🌹
అదిగో వారే విష్వక్సేనులు !
వారే శ్రీవారి ముఖ్య సేనాధిపతి ! 🙏
వీరే బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఎట్లున్నవో పరిశీలించుటకు , అంకురార్పణ దినమున , మునుముందుగా తానే తిరుమల నాలుగు మాడవీధులలో విహరించెదరు .🙏
వీరే విఘ్న నాశకులు , జయ ,శుభ ప్రదాతయును .
వీరికి తొలిపూజచేసి , మ్రొక్కి ధన్యులమౌదాము !🙏
🌺🍃 -----------🍃🌺
మున్నుడి ః-- 🌹👇
యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యా పరశ్శతం ,
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే !
🙏🙏
విష్వక్సేనులు నిత్య సూరలు , నారాయణుని సర్వ సైన్యాధి పతి.
ఆ పరమాత్ముని నిత్య విభూతి, లీలా విభూతి కార్యములను పర్యవేక్షించు సేనాధి పతి, వేత్రధరులు ! సేన ముదల్వర్, ( ఇదియే సేనమొదలారి గా అన్నమయ్య కీర్తించుచున్నారు ) 🙏
‘సూత్రవతి‘ విష్వక్సేనుల వారి దివ్యమహిషి.
భగవానుడి శేష ప్రసాదాన్ని ప్రథమంగా విష్వక్సేనులవారే స్వీకరిస్తారు.🙏
వైష్ణవంలో ఏ శుభకార్యమైనా ,దైవకార్యమైనా విష్వక్సేనుని ఆరాధనతోనే మొదలు.🙏
బ్రహ్మోత్సవాలకు ఒక రోజు ముందే తిరుమలలో విష్వక్సేనుల వారు తామే నాలుగు మాడవీధులందూ ఊరేగి పర్యవేక్షిస్తారు , అన్ని ఏర్పాట్లనూ ! 🙏
వారినే సేనమొదలారి అని కీర్తుస్తున్నారు అన్నమయ్య !🙏
మరి ఈ చక్కని కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇
🌺🍃 ----------- 🍃🌺
🌹🌹
నువ్వేకదా ! మేము చెప్పటానికీ చూపటానికీ నువ్వు మాత్రమే కదా ,
ఆ శ్రీ మహాలక్ష్మీ పతియైన శ్రీమన్నారాయణునికి , అతి ముఖ్యమైన వాడవు ,ఆతని సర్వసైన్యాధ్యక్షుడవు ! 🙏
🌹🌹
ఆ దేవతలెవ్వరెవ్వరు శ్రీహరి దర్శనార్ధులై వచ్చినా వారికి , నువ్వే కదా కళ్ళనెదుటనే ముందుగా నిలబడుచు కనిపించేది ఆ శ్రీహరి సన్నిధి వద్ద .🙏
ఎవరెవరు ఏ దారుల వెంబడి వచ్చినా , ఆ లక్ష్మీ వల్లభునకు , నిజమైన సేవకుడవనగా ప్రప్రధముగా నీవే ఓ విష్వక్సేనా ! ( సేనముదళ్వర్ )🙏
🌹🌹
బంగారు బెత్తములను చేతపుచ్చుకుని ఉన్న గజముఖులైన సేనాగణములు వేవేలుగా గలిగి ,
వారికి నీ ఆజ్ఞలను జారీ చేస్తూ అన్ని దిక్కులకూ పంపుచు విష్ణువు యొక్క విజయము సదా పరగునట్లు చేయుచున్నావు .🙏
ముల్లోకముల వారిని నీవే వశపరచుకుని , వారినందరినీ నీ సంతానమువలె భావించి ,కాపాడుకొనుచున్నావు వారికందరికీ ప్రభువువై ఓ విష్వక్సేనా ! ( సేనమొదలారి )🙏
🌹🌹
రాక్షసరాజులైన వారినెందరినో తునాతునకలుగా భంజించి సంహరించిన పరాక్రమవంతుడవు !🙏
ఈ జగమునంతా ఏకము చేసి , ఒకే రాజ్యముగా ఏలుచున్నవాడవు .
సూత్రవతికి పతివి ,
అంతటా వ్యాపించి ,ఇదిగో శ్రీ వేంకటేశ్వరుని సంపదలను గాచు పెద్దభాండాగారమువై , నీవే వెలసి ఉన్నావు ఓ విష్వక్సేనా ఓ సేనమొదలారి , నీకు మా తొలిపూజలు ! 🙏
🌹🙏🌹
ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
#NEEVEKA #CHEPPACHOOPA #నీవేకాచెప్పజూప #salurivasurao #pavancharan #BRAHMOTSAVAM #brahmotsavalu #brahmotsav #annamacharya #annamacharyakeerthanalu #annamayya #annamayyaaksharavedam #annamayyakeerthanalu #annamayyasongs

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 13 дней назад
నీవేకా చెప్పజూప నీవె నీవెకా.. 🌹🌹-----------------🌹🌹 తాళ్లపాక అన్నమాచార్య ఆధ్యాత్మ సంకీర్తన రాగము: లలిత రేకు: 0042-01 సంపుటము: 1-255 స్వరకర్త ః-- శ్రీ సాలూరి వాసూ రావు గారు రాగము ః-- కళ్యాణి గానము ః- శ్రీ వవన్ చరణ్ 🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ నీవేకా చెప్పఁజూప నీవె నీవెకా శ్రీ విభుప్రతినిధివి సేన మొదలారి ॥చ1॥ నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద దేవతలఁ గనిపించే దేవుఁడవు యేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజ- సేవకుఁడవు నీవెకా సేనమొదలారి ॥చ2॥ పసిఁడి బద్దలవారు పదిగోట్లు గొలువ దెసలఁ బంపులువంపే దీరుఁడవు వసముగా ముజ్జగాలవారి నిందరిని నీ- సిసువులఁగా నేలిన సేనమొదలారి ॥చ3॥ దొరలైన యసురుల తుత్తుమురు సేసి జగ- మిరవుగా నేలితి వేకరాజ్యమై పరగుసూత్రవతీ పతివై వేంకటవిభు- సిరుల పెన్నిధి నీవే సేనమొదలారి 🌺🍃 ----------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం సంపుటి -- 503 ( నీవేకా చెప్పజూప నీవె నీవెకా ) 🌺🍃 ----------- 🍃🌺 ఓం నమో వేంకటేశాయ. 🙏 అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 503 కి శుభ స్వాగతం ..🙏 ప్రార్థన ః--🌹🙏 నారాయణు సేనాపతి దారులనన్నిటిని జూడ దానరుదెంచెన్, వారే విష్వక్సేనులు, చేరికొలువ నతడె జయముశివముల నొసగున్ ! 🌹🙏🌹 ✍ --స్వీయపద్యము ( కందము ) 🌹🌹 అదిగో వారే విష్వక్సేనులు ! వారే శ్రీవారి ముఖ్య సేనాధిపతి ! 🙏 వీరే బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఎట్లున్నవో పరిశీలించుటకు , అంకురార్పణ దినమున , మునుముందుగా తానే తిరుమల నాలుగు మాడవీధులలో విహరించెదరు .🙏 వీరే విఘ్న నాశకులు , జయ ,శుభ ప్రదాతయును . వీరికి తొలిపూజచేసి , మ్రొక్కి ధన్యులమౌదాము !🙏 🌺🍃 -----------🍃🌺 మున్నుడి ః-- 🌹👇 యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యా పరశ్శతం , విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ! 🙏🙏 విష్వక్సేనులు నిత్య సూరలు , నారాయణుని సర్వ సైన్యాధి పతి. ఆ పరమాత్ముని నిత్య విభూతి, లీలా విభూతి కార్యములను పర్యవేక్షించు సేనాధి పతి, వేత్రధరులు ! సేన ముదల్వర్, ( ఇదియే సేనమొదలారి గా అన్నమయ్య కీర్తించుచున్నారు ) 🙏 ‘సూత్రవతి‘ విష్వక్సేనుల వారి దివ్యమహిషి. భగవానుడి శేష ప్రసాదాన్ని ప్రథమంగా విష్వక్సేనులవారే స్వీకరిస్తారు.🙏 వైష్ణవంలో ఏ శుభకార్యమైనా ,దైవకార్యమైనా విష్వక్సేనుని ఆరాధనతోనే మొదలు.🙏 బ్రహ్మోత్సవాలకు ఒక రోజు ముందే తిరుమలలో విష్వక్సేనుల వారు తామే నాలుగు మాడవీధులందూ ఊరేగి పర్యవేక్షిస్తారు , అన్ని ఏర్పాట్లనూ ! 🙏 వారినే సేనమొదలారి అని కీర్తుస్తున్నారు అన్నమయ్య !🙏 మరి ఈ చక్కని కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !👇 🌺🍃 ----------- 🍃🌺 🌹🌹 నువ్వేకదా ! మేము చెప్పటానికీ చూపటానికీ నువ్వు మాత్రమే కదా , ఆ శ్రీ మహాలక్ష్మీ పతియైన శ్రీమన్నారాయణునికి , అతి ముఖ్యమైన వాడవు ,ఆతని సర్వసైన్యాధ్యక్షుడవు ! 🙏 🌹🌹 ఆ దేవతలెవ్వరెవ్వరు శ్రీహరి దర్శనార్ధులై వచ్చినా వారికి , నువ్వే కదా కళ్ళనెదుటనే ముందుగా నిలబడుచు కనిపించేది ఆ శ్రీహరి సన్నిధి వద్ద .🙏 ఎవరెవరు ఏ దారుల వెంబడి వచ్చినా , ఆ లక్ష్మీ వల్లభునకు , నిజమైన సేవకుడవనగా ప్రప్రధముగా నీవే ఓ విష్వక్సేనా ! ( సేనముదళ్వర్ )🙏 🌹🌹 బంగారు బెత్తములను చేతపుచ్చుకుని ఉన్న గజముఖులైన సేనాగణములు వేవేలుగా గలిగి , వారికి నీ ఆజ్ఞలను జారీ చేస్తూ అన్ని దిక్కులకూ పంపుచు విష్ణువు యొక్క విజయము సదా పరగునట్లు చేయుచున్నావు .🙏 ముల్లోకముల వారిని నీవే వశపరచుకుని , వారినందరినీ నీ సంతానమువలె భావించి ,కాపాడుకొనుచున్నావు వారికందరికీ ప్రభువువై ఓ విష్వక్సేనా ! ( సేనమొదలారి )🙏 🌹🌹 రాక్షసరాజులైన వారినెందరినో తునాతునకలుగా భంజించి సంహరించిన పరాక్రమవంతుడవు !🙏 ఈ జగమునంతా ఏకము చేసి , ఒకే రాజ్యముగా ఏలుచున్నవాడవు . సూత్రవతికి పతివి , అంతటా వ్యాపించి ,ఇదిగో శ్రీ వేంకటేశ్వరుని సంపదలను గాచు పెద్దభాండాగారమువై , నీవే వెలసి ఉన్నావు ఓ విష్వక్సేనా ఓ సేనమొదలారి , నీకు మా తొలిపూజలు ! 🙏 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ✍ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 12 дней назад
Om Vishwaksenaya Namaha🙏🙏🙏 Sena Modalaari Vari gurinchi; wonderful Sankeertana; Munnudi Chakkaga vivarincheru; Keerthana Ardhamu chala Baga explain chesaru; Abhinandanalu🙏 lord vishwaksena vari Darsanam chayisthu; chakkani Keerthananu adbhutamga present Chesaru; Sri Venugopal Garu, thank you so much; excellently sung bysri Pavan charangaru; om Namo Venkatesaya🙏🙏🙏
@ramaraoayithy9472
@ramaraoayithy9472 12 дней назад
Om namo narayana govinda govinda
@ramakrishnaanisingaraju7129
@ramakrishnaanisingaraju7129 12 дней назад
ఓమ్ నమో వేంకటేశాయ. బ్రహ్మోత్సవ శుభారంభం సందర్భంగా, విష్వక్సేనుల వారి చక్కని కీర్తన కళ్యాణి రాగంలో విని ఆధ్యాత్మిక అనుభూతి పొందాము. శ్రీ పవన్ చరణ్ అద్భుతంగా ఆలపించారు. మీకు, వారికి ధన్యవాదములు. ఈ నవరాత్రులూ మీ ద్వారా మరిన్ని ఆణిముత్యాల కోసం ఎదురు చూస్తుంటాం. ధన్యోస్మి 🙏🌷
@SiddavatamThirupathiredd-ne7uw
@SiddavatamThirupathiredd-ne7uw 12 дней назад
Govindaa govindaa govindaa
@padmaiyengar5387
@padmaiyengar5387 12 дней назад
🙏🙏🙏
@AnnamayyaKalaSamithiNakrekal
@AnnamayyaKalaSamithiNakrekal 12 дней назад
🙏🙏 చక్కటి కీర్తన వాసు సార్ సంగీతంలో మరో చక్కటి కీర్తన అంతే చక్కగా పాడారు పవన్ గారు, వేణుగోపాల్ సార్ మీ చేతుల్లో ఏదో అద్భుతం ఉన్నది సార్ కళ్ళకు కట్టినట్లు చూపించారు కీర్తనలో ప్రతి లైన్ కి అర్ధం 🙏🙏🙏
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 13 дней назад
🌺☘ -----------☘🌺 ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 503 ( NEEVEKA CHEPPA CHOOPA .. ) 🌺☘ -----------☘🌺 PREFACE :-- Yasya Dvirada VaktradyaH ParishadyaH Parassatam Vighnam Nighnanti Satatam Vishvaksenam Tamashraye ! 🙏🙏 In whom the attendants, having an elephant face (and so on), more than a hundred, Always destroy obstacles, In Him, Viṣvaksena, I take refuge !!🙏 Lord Vishwaksena also known as SENAI MUDALVAR or SENADHIPATHI (Army Chief) is the Commander in Chief of Lord Vishnu !🙏 He is worshipped before any ritual in Sri Vaishnavism And in Vaikhanasa and Pancharatra Temple traditions !🙏 Temple festivals begin with his Worship and Procession.🙏 Annamacharya is praying Thus Lord Vishwaksesna as Sena modalaari and glorifying his virtues in this keertana ! 🙏 Here goes the wonderful keertana as below ! 👇 🌺☘ -----------☘🌺 🌹🌹 To Say And Show ! You Are ! You Are ! You Are The Prime Representative of The Lord Of Sri MahaLakshmi And His Army Commander-InChief !🙏 🌹🌹 You Are The Lord Who Is Seen Right Infront Standing Near to The Lord Sri Hari !🙏 You Are The Lord Who is Seen Foremost By All The Dieties Wishing To See Lord Sri Hari !🙏 From What Ever Direction We Approach You Are There Near The Lord Of Indira As As The Most Truthful Servant , Oh Chief Commander Of The Army Of Vishnu !🙏 Sena Modalaari ( The Chief Commander )🙏 🌹🌹 Being Worshipped by Crores Of Military Men Holding Golden Rattan Canes , You Are The Supremely Brave Lord Commanding Them And Sending Them To All Directions For The Victory Of Vishnu !🙏 You Have Overpowered Every Being Of The Three Worlds , And Taming Them As Your Kids , Oh Great Ruler ! Oh Lord Viswaksena ! 🙏 Salutations To Lord Vishwaksena ( Sena Modalaari - The Commander In Chief )🙏 🌹🌹 You Have Destroyed Into Pieces All Those Demon Kings ! You Are Ruling This World As A Single Kingdom , By Making It As A Good Shelter To All , You Are Spreadingly Shining As The Lord Of Sutravati And You Are Here Now As The Treasure House Of Lord Sri Venkateswara's Wealth !🙏 Salutations To Sena Modalaari The Commander In Chief Of Lord Vishnu Oh Lord Vishwaksena !🙏 🌹🙏🌹 Om Sri Alamelumanga Sametha Sri Venkateswara Swaminey Namaha !🙏 🌹🙏🌹 ✍ --Venu Gopal
Далее
НЮША РОЖАЕТ?
00:17
Просмотров 948 тыс.
GALINAI POYAANU KALAKAALAMU
10:11
Просмотров 272 тыс.
Anthayu Neeve - అంతయు నీవే
8:08
Просмотров 167 тыс.