#hyderabad #Policelathicharge #rahulgandhi #bjym #abpdesam #telugunews
హైదరాబాద్ లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ యువమోర్ఛా చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. లోక్ సభలో హిందూ దేవతలపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయంటూ బీజేపీ యువమోర్ఛా రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ నేతృత్వంలో బీజేపీ యువమోర్చా నాయకులు నాంపల్లిలో ఆందోళనకు దిగారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఆందోళనకారులు గాంధీ భవన్ దిశగా దూసుకెళ్లే ప్రయత్నం చేయటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ సందర్భంగా పోలీసులకు, బీజేవైఎం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితిని సద్దుమణిగించేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళన చేస్తున్న బీజేవైఎం నేతలను చెదరగొట్టారు. నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
Police Lathi Charge at Hyderabad | హైదారాబాద్ లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసన..లాఠీ ఛార్జ్ | ABP
Subscribe to the ABP Desam RU-vid Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive.com
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam
3 июл 2024