అన్నా మీ మొత్తం మాటల్లో ౩-౪ సార్లు మటుకే ఆంగ్ల పదాలు వాడారు అవి కూడా తెలుగులో మీరు చెప్తే దాదాపుగా ఎవ్వరికీ అర్థం కానివి. మీరు నేటి తరానికి ఒక విలువైన ఆస్తి,మీ ఈ ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపకండి. మీ ఈ కృషికి నెనర్లు🙏
తెలుగు భాష కోసం కృషిచేస్తున్న అనంతసాయి గారికి ధన్యవాదాలు. తెలుగు లో గొప్ప శాస్త్రవేత్తలు, గొప్పవాళ్ళు ఉన్నారు. ప్రపంచానికి కుంగ్ ఫూ కనిపెట్టిన బోధిధర్మ,AIటెక్నాలజీ కనిపెట్టిన వారిలో ఒకరైన డబ్బాల సుబ్బారావు, అధ్బత ఔషధ మాంత్రికుడు యర్రప్రగడ సుబ్బారావు,ప్రపంచానికే సర్కస్ నేర్పించిన కోడి రామ్మూర్తి,ప్రపంచానికి మిమిక్రి నేర్పించిన నేరేళ్ళ వేణు మాధవ్ గార్లు మన తెలుగు వార్లే అని మరిచిపోకండి ఎవరైనా. తెలుగువారు దేనికి తక్కువారు కారు.
చాలా మంచి ఛానల్ ప్రారంభించి ఈ తరానికి చాలా వరకు మంచి భాష నేర్పిస్తున్న మీకు నిజంగా ధన్యవాదములు తెలియజేయాల్సిందే.. నేను కూడా మీ ఛానల్ కి ఒక చందాదారుడిని....
తెలుగు భాష కోసం, తెలుగు వారికే స్వంతమైన ఆచారాలు, సాంప్రదాయాలు, కళలు, వ్యాపారాలు, తీరుతెన్నుల కోసం ఊబలాట పడుతూ పరితపించిపోతున్న వాడిని నేను, 🥰, ప్రతిరోజు మీ ఛానెల్ లో పెట్టిన విషయాలు, నేను పదే పదే చూస్తూ ఉంటాను, మీకు కావలసిన కంటెంట్ కూడా ఇవ్వగలను, 🤗
Really you have a great talent in this modern Era.You are the inspiration to Young generation, especially our Telugu people.Keep it up.I wish you have to reach every Telugu Speaking people.Great job.
Very good Sai keep it up maa👌👌👍 we are feeling very proud of you ....the way you are speaking is in a very polite manner like your Mother( Mam) .....all the best for your bright future
Anna you are very inspirational Ur channel is very inspiring May this journey continue and u make Telugu language and Telugu people proud and u reach greater heights
ఇంగ్లీష్ భాష చాకో లేట్ లాంటిది.రుచి అదే తీపి మాత్రమే ఉంటుంది. అదే మన తెలుగు భాష ఐతే మామిడి కాయ ఎన్ని రకాలో , తెలుగు భాష సొగసులు అన్ని రకాలు, చూడ చక్కని గుండ్రటి తెలుగు ఆకారం, చక్కని తెలుగు మాటల్లో గమనిస్తే ఉండును మమకారం, చిలిపి తనపు ఉండు వెటకారం, తెలుగు పాట పాడవో ప్రపంచం మంతా చేసెను విహారం, ప్రపంచమంతా సూర్యుడు వెలుగు, చల్లని చంద్రుని కాంతి మన తెలుగు, మామిడిపండు కొరికి చుడు రుచి తెలుసును, తెలుగు తెలుసుకొని చూడు నీవు ప్రపంచం
అభినందనలు. వార్తాపత్రికలు, చలనచిత్రాలు, కుక్క గొడుగులు లాగా వస్తున్న ఆంగ్ల మాధ్యమ బడులు, ప్రభుత్వ ఉదాసీన వైఖరి మొదలగునవి తెలుగు భాష కు అపారమైన కీడు కలిగిస్తున్నాయి. చలనచిత్రాల సంభాషణలలో, పాటలలో తెలుగు తక్కువ, ఉర్దూ ఆంగ్ల పదాలు ఎక్కువ. ఇప్పుడు విడుదల అవుతున్న చలనచిత్రాల పేర్లలో తెలుగు ఏమాత్రం కనిపించదు. దీనికి కారణం ఆ చిత్రాలు తీసేవారు తెలుగు భాష గురించి ఏమీ తెలియని తెలుగు వాళ్ళు. ఇక వార్తాపత్రికల గురించి చెప్పనక్కర్లేదు. పతాక శీర్షికలు కూడా లిప్యంతరము చేయబడిన ఆంగ్ల, ఉర్దు పదాలు. తెలుగు దూరదర్శిన మాధ్యమాలలో వచ్చే ధారావాహికాలలో అంతా ఆంగ్లం లేకపోతే అపభ్రంశపు తెలుగు. తెలుగు రాని వారి చేతుల్లో ఈ మాధ్యమాలన్నీ ఉన్నాయి. తెలుగు చిత్రాలలో నటించే నటీనటులలో చాలామంది తెలుగు రాని వారే.