Yehova Yakobunu || యెహోవా యాకోబును నీకై Song Lyrics
పల్లవి : యెహోవా యాకోబును నీకై - ఏర్పరచుకొంటివి
ఇశ్రాయేలును స్వకీయధనుముగా - ఏర్పరచుకొంటివి
నీదు సంకల్పములు మారవు - మార్పు చెందవు
నీదు వాగ్దానములు - మాకు అమూల్యములు
1. గొఱ్ఱెలన్ కాచిన దావీదును -
గొప్ప రాజుగ చేసితివి
నీదు హృదయానుసారునిగా -
ఉండుటకై ఏర్పరచితివి ll నీదు ll
2. ముమ్మారు బొంకిన పేతురును -
నీదు ఆత్మతో నింపితివి
కేఫాగా స్థిరపరచితివి -
వేవేలను రక్షించితివి ll నీదు ll
3. శిష్యులన్ హింసించె సౌలును -
దమస్కునొద్ద దర్శించితివి
అన్యజనులకు సాక్షిగను -
పౌలుగా మార్చితివి ll నీదు ll
4. పాపులమైన మమ్ములను -
పరిశుద్దులుగా చేయుటకు
అద్వితీయ కుమారునిగా -
ప్రాణార్పణము గావించితివి ll నీదు ll
#Yehovayakobunu #ziontelugusongs
24 сен 2024