Тёмный

గీతా జయంతి మరియు వైకుంఠ ఏకాదశి రోజు పాటించవలసిన 5 విషయాలు (23/12/2023)# 

Maheshwar Das (MSD)
Подписаться 650
Просмотров 457
50% 1

Опубликовано:

 

12 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@maheshwaradas
@maheshwaradas 9 месяцев назад
*వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మనం ఆచరించవలసిన 5 విషయాలు:* 1. దేవుని ఆశీస్సులను కోరండి - విష్ణువు ఆలయాన్ని సందర్శించండి 2. ధ్యానం చేయుటకు ప్రయత్నించండి - హరే కృష్ణ మహా మంత్రాన్ని జపించండి3. జ్ఞానోదయం కలిగించుకోండి - భగవద్గీతను చదవండి 4. ఉపవాసం పాటించండి - ఏకాదశి 5. సేవ చేయండి - విష్ణువుకు సేవను సమర్పించండి *1) దేవుని దీవెనలు కోరండి - విష్ణువు ఆలయాన్ని సందర్శించండి* మీ పరిసరాల్లోని విష్ణువు ఆలయాన్ని లేదా అతని అవతారాలలో ఉన్న ఏదైనా ఒక ఆలయాన్ని సందర్శించి వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొనండి. దాదాపు అన్ని విష్ణు ఆలయాలలో, ఈ రోజున వైకుంఠ ద్వారము అనే ప్రత్యేక ప్రవేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున ఈ ద్వారాన్ని దాటిన వారు వైకుంఠాన్ని పొందుతారని చెబుతారు. శాస్త్రాలలో ఈ విధముగా చెప్పబడింది: విగత కుంథాద్ యస్మాద్ ఇతి వైకుంఠ, “ఇక్కడ భౌతిక ప్రపంచంలో మీరు ఎల్లప్పుడూ కుంఠలతో, ఆందోళనలతో నిండి ఉంటారు. మీరు విష్ణువు లేదా కృష్ణుడి వద్దకు వెళితే, ఇక అక్కడ కుంఠమనేది లేదు-ఆందోళన లేకుండా పూర్తి స్వేచ్ఛగా ఉంటుంది.” -శ్రీల ప్రభుపాద. ఒకవేళ, మీరు ఆలయాన్ని సందర్శించలేకపోయినప్పుడు, మీ ఇంట్లో విష్ణువు, కృష్ణుడు లేదా అతని అవతారముల(రాముడు, నరసింహుడు మొదలైనవి) యొక్క విగ్రహములు ఉన్నట్లయితే, మీరు ఆ భగవంతుణ్ణి చక్కగా అలంకరించి, మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేయవచ్చు. *2) ధ్యానం చేయుటకు ప్రయత్నించండి - హరే కృష్ణ మహా మంత్రాన్ని జపించండి* వైకుంఠ ఏకాదశి రోజున హరే కృష్ణ మహా మంత్రాన్ని జపించండి. *హరే కృష్ణ హరే కృష్ణ* *కృష్ణ కృష్ణ హరే హరే* *హరే రామ హరే రామ* *రామ రామ హరే హరే* వేద గ్రంధాలలో సిఫార్సు చేయబడిన విధముగా కలియుగంలో ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి సులభమైన మార్గం శ్రీకృష్ణుని పవిత్ర నామాలను జపించడం. హరే కృష్ణ మహా-మంత్రము యొక్క ప్రాముఖ్యత కలి-సంతరణ ఉపనిషత్తులో ప్రస్తావించబడింది. అదే విధముగా ఈ ఉపనిషత్తులో ఇలా చెప్పబడింది, "అన్ని వేద సాహిత్యాలను శోధించిన తరువాత, ఈ యుగానికి హరే కృష్ణ మహామంత్రము యొక్క జపము కంటే గొప్ప మతం కనుగొనబడలేదు." ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మన హృదయము శుద్ధి చేయబడుతుంది. మన జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది మరియు చివరికి ఆధ్యాత్మిక పరిపూర్ణతను పొందడంలో సహాయపడుతుంది. *3) జ్ఞానోదయం కలిగించుకోండి - భగవద్గీతను చదవండి* గీతా జయంతి సాధారణంగా వైకుంఠ ఏకాదశి వచ్చే మాసములోనే వస్తుంది. గీతా జయంతి అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సారాంశాన్ని ఉపదేశించిన రోజు. అందువల్ల, ఈ రోజున భగవద్గీతను చదవడం అనేది చాలా ముఖ్యంగా నిర్దేశింపబడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఒకటి. శ్రీకృష్ణుని కీర్తిస్తూ రెండు రకాల సాహిత్యాలు ఉన్నాయి. ఒకటి భగవంతుని గురించిన మహిమలను కలిగి ఉంటుంది మరియు మరొకటి నేరుగా భగవంతునిచే చెప్పబడింది. భగవద్గీతను శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా పలికాడు కాబట్టి, గీతకు కృష్ణుడికి తేడా లేదు. గీతా పఠనం చేయడం వల్ల శ్రీకృష్ణునితో సహవాసం చేసినంత ఫలితం లభిస్తుంది. గీతా శ్లోకాలను పఠించడం మరియు వాటి అర్థాన్ని అర్థం చేసుకోవడంలో కొంత సమయమును గడపండి. *4) ఉపవాసం పాటించండి - ఏకాదశి* ఇది ఏకాదశి రోజు కాబట్టి, ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి. ఉపవాసం మన శరీరానికి మరియు మనస్సుకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా ఆధ్యాత్మిక ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఉపవాసాన్ని పాటించడంలో వివిధ స్థాయిలు ఉన్నాయి మరియు మీరు మీ సౌలభ్యం ప్రకారం ఒక స్థాయిని ఎంచుకోవచ్చు. *5) సేవ చేయండి - విష్ణువుకు సేవ చేయండి* భగవద్గీత 2.72 భాష్యంలో ఈ విధముగా చెప్పబడింది: "భగవంతుని యొక్క ధామమునకు మరియు భక్తియుత సేవకు మధ్య తేడా లేదు." కాబట్టి, శ్రీమహావిష్ణువుకు సేవ చేయడం మరియు వైకుంఠంలోనికి ప్రవేశించడం వేరు కాదు. మీరు ఈ పవిత్రమైన రోజున మా ఆలయంలో ఈ క్రింది సేవలను సమర్పించి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ రాధా గోవిందుల ఆశీస్సులను పొందవచ్చు. 1. ప్రసాద వితరణ, పుస్తక వితరణ, సందర్శకులకు మార్గనిర్దేశం చేయడం వంటి వివిధ సేవలకు స్వచ్ఛందంగా పని చేయండి. 2. వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి.
@maheshwaradas
@maheshwaradas 9 месяцев назад
*వైకుంఠ ఏకాదశి (23 డిసెంబర్ 2023)* ప్రతి సంవత్సరం జరుపుకునే ముఖ్యమైన పండుగ వైకుంఠ ఏకాదశి. ఏకాదశి నెలకు రెండుసార్లు, చంద్రుని వృద్ధి లేదా క్షీణత యొక్క పక్షంలోని పదకొండవ రోజు వస్తుంది. కానీ మార్గశీర్ష మాసం (డిసెంబర్ - జనవరి)లో వృద్ధి చెందుతున్న చంద్రుని పక్షం రోజులలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మరియు ఆ పర్వదినం వైకుంఠ ఏకాదశిగా కీర్తించబడుతుంది. ఈ రోజున, వైకుంఠము (భగవంతుని నివాసం) యొక్క ద్వారాలు అతని భక్తుల కోసం తెరవబడతాయి. ఈ రోజున విష్ణు భక్తులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, ఆయన పవిత్ర నామాలను జపిస్తూ, ఆయన మహిమలను గానం చేస్తూ ఆ దేవాదిదేవుని స్మరించుకుంటారు. శ్రీ సంప్రదాయం (లక్ష్మీ దేవి నుండి వచ్చిన శిష్య పరంపర) లో ఒక గొప్ప భక్తుడైన నమ్మాళ్వార్, ఈ శుభప్రదమైన రోజునే ఆ దేవాదిదేవుని యొక్క ధామానికి తిరిగి వెళ్ళాడు. ఈ సంఘటనను గుర్తుచేసుకోవడానికి అన్ని విష్ణు దేవాలయాలలో సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ప్రత్యేకమైన రోజున వైకుంఠ ద్వారం (వైకుంఠానికి ప్రత్యేక ప్రవేశం) తెరవబడుతుంది. ఈ రోజున వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించిన ఎవరైనా ఆధ్యాత్మిక నిలయమైన వైకుంఠాన్ని పొందడం ఖాయమని నమ్ముతారు.
@maheshwaradas
@maheshwaradas 9 месяцев назад
భగవద్గీత 2.72 భాష్యంలో ఈ విధముగా చెప్పబడింది: "భగవంతుని యొక్క ధామమునకు మరియు భక్తియుత సేవకు మధ్య తేడా లేదు." కాబట్టి, శ్రీమహావిష్ణువుకు సేవ చేయడం మరియు వైకుంఠంలోనికి ప్రవేశించడం వేరు కాదు. మీరు ఈ పవిత్రమైన రోజున మా ఆలయంలో ఈ క్రింది సేవలను సమర్పించి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ రాధా గోవిందుల ఆశీస్సులను పొందవచ్చు.
Далее
КУШАТЬ ХОЧЕШЬ? #дистори
00:15
Просмотров 214 тыс.
GENIUS FOOD HACKS 🍰 #shorts
00:36
Просмотров 14 млн