జై గురు దేవా 🙏🙏. ధన్యవాదాలు గురువుగారు గ్రంధిత్రయ విభేదన గురించి చాలా బాగా వివరించారు. నేను ఎప్పుడూ గ్రంథుల గురించి వినలేదు ఇప్పుడే మీరు చెప్పినది విన్నానండీ గురువుగారు. బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు మూడనీ స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మహా కారణ శరీరమనీ గ్రంథి అంటే ముడి అనీ మన శరీరంలో ఎన్ని రకాల నాడులో ఎన్ని చక్రాలో ఉంటాయనీ ఎలా పనిచేస్తాయనీ విభేదాలు ఏలా జరుగుతాయో ఎప్పుడు జీవుడు బ్రహ్మానందం పొందగలడో ఇలా గ్రంథిత్రయ విభేనం ఎలా చేయాలన్న విషయాన్ని చాలా సరళంగా సులభంగా చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించిన మీకు శిరసావహించి నమస్కరిస్తున్నాను గురువు గారు 🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 మీరు జీవుడు ప్రత్యగాత్మ అన్నారు కదా జీవుడు అంటే మనమే అని అర్థమయ్యింది ప్రత్యగాత్మ అంటే పరమేశ్వరుడే అనుకుంటున్నాను గురువుగారూ అవునంటారా కాదా తెలపగలరా 🙏