పాండవులు కురుక్షేత్ర యుద్ధ తదనంతరం కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించారు ఆ తర్వాత వారి మరణ సంకేతాన్ని గ్రహించి మనం చేసిన పుణ్య కార్యాలకు మనకు స్వర్గప్రాప్తి కలుగుతుంది కానీ మనం ఇక్కడ మరణించ రాదు శరీరులు గానే స్వర్గాన్ని చేరుకోవాలి అని పాండవులు నిర్ణయించుకుంటారు అలానే స్వర్గానికి ప్రయాణం సాగిస్తారు వారితో పాటు ద్రౌపది కుక్క కూడా ప్రయాణం చేస్తాయి చివరకు స్వర్గానికి చేరువ దగ్గర లోకి వెళ్లారు అది గమనించిన శ్రీ కృష్ణుడు లోకకల్యాణార్థం శరీరంతో సహా స్వర్గానికి చేరుకో కూడదు అనే తలపించి పాండవులు వెళ్ళే దారిలో ఒక పిచ్చి రైతుగా ప్రత్యక్షమై ఒక అమ్మ ఒక మహావృక్షాన్ని పెకలించి దాన్ని తలక్రిందులుగా ఉంచి నీళ్లు పోస్తూ ఉంటాడు కృష్ణుడు అది గమనించిన ధర్మరాజు ఆ రైతు తో ఇలా అన్నాడు అయ్యా ఎవరైనా చెట్టును తిప్పి పాతి మీరు పోస్తా రా పోసినా అది ప్రయోజనం లేదు కదా ఎందుకు ఇలా ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు రైతు ఇలా అన్నాడు. అయ్యా నా సంగతి పక్కన ఉంచండి మీరు ఎవరో ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు ఆ రైతు ధర్మరాజు వినయంగా తన పేర్లను వివరించి తాను వెళ్ళవలసిన స్వర్గప్రాప్తి గురించి కూడా వివరించాడు అది విన్న రైతు ఇలా అంటాడు నేను చేసేది ప్రకృతికి విరుద్ధం కాదు మొక్కలు త్రిప్పి ఉంచినను దానికి వేర్లు పోసి చిగురించెను కానీ మీరు చేసే పనే ప్రకృతికి విరుద్ధంగా ఉంది మునుపెన్నడూ అయిననూ ఇలాంటి అమానుష కార్యాలకు ఎవరు పాల్పడలేదు బొంద తో పాటుగా స్వర్గానికి చేరుకోవాలి అనేది దురాశ మీ ప్రయాణాన్ని చాలించే తిరిగి మీరు స్వగ్రామానికి చేరుకొండి అది మీకు మంచిది అని ఆ రైతు వివరించాడు ఆ రైతు వాటి లెక్కచేయకుండా ధర్మరాజు ముందుకు కొనసాగాడు ముందుకు వెళుతూ ధర్మరాజు తన తమ్ముళ్ళతో మన ప్రయాణానికి అవంతరాలు కలగవచ్చును కనుక మీరు ఎవరు వెనక్కి తిరిగి చూడకుండా నన్ను అనుసరించండి అప్పుడే మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతున్నాం అని చెప్పాడు. శ్రీకృష్ణుడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఎంత పిలిచినా పలకకుండా ఎవరు వెనక్కి తిరిగి చూడకుండా ధర్మరాజు అనుసరిస్తున్నారు శ్రీకృష్ణుడు అయ్యో వీరిని ఆపడం ఎలా మీరు ఇంత కఠినంగా ప్రయాణం కొనసాగిస్తున్నారు వీరిని ఎలాగైనా ఆపాలి అని సంకల్పించి శ్రీకృష్ణుడు వారి ముందు రెండు కాళ్లు రెండు చేతులు లేకుండా మల్ల మల్ల మాడే ఎండలో ఇసుకపై పడి దొర్లుతూ కనిపించాడు అది చూసి కూడా పాండవులు వారి ద్రోవన వారు పో సాగారు అప్పుడు శ్రీకృష్ణుడు బావ అర్జున నేను ఎన్నిసార్లు నీ మరణం గండాల నుంచి తప్పించ లేదు నాకు చాలా ఆకలి దప్పిక లు ఉన్నాయి వాటిని తీర్చి వెళ్ళు అని అడిగాడు దానికి సమాధానం గా అర్జునుడు తిరిగి చూడకుండానే బావా శ్రీ కృష్ణ పరమాత్మ మేము వెళ్లే ప్రయాణం నీకు తెలుసు కదా మేము ఎవరినీ తిరిగి చూడము అన్నాడు అందుకు శ్రీకృష్ణుడు కనీసం నీ పక్కన ఉన్న గడ్డి నైననూ నా పక్కకు తోసి వెళ్ళు అన్నాడు అర్జునుడు వెనక్కి తిరిగి చూడకుండా ఆ గడ్డిని కృష్ణుడికి నోటి దగ్గరకు జిమ్మీ ప్రయాణం సాగిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు ఆ గడ్డిపోచను నోట్లో పెట్టుకుని భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది ఈ అయిదుగురు ప్రాణాలు హరిస్తాడు భీముడు బలవంతుడు కనుక ధర్మరాజు వెనకనుండి ఒక్కసారిగా ఎగిరి ధర్మరాజు ముందుకు దూకుతాడు దూకి ప్రాణాలు వదులుతూ అన్నా ఏమిటి ఇది మనం ఎవరిని తిరిగి చూడలేదు కదా ఎందుకు మేము ప్రాణాలు కోల్పోతున్న ము నీ ప్రాణం ఎందుకు పోవడం లేదు అని అడిగాడు దానికి సమాధానంగా ధర్మరాజు ఇలా వివరిస్తాడు.......... తరువాయి భాగం మళ్ళీ చెప్పుకుందాం. ఫోన్..9346393891
I appreciate your passion to create awareness on our proud full history but there some corrections in your story. Also please pronounce the names and other words properly. So that people will concentrate and likes your initiative