వరి సాగులో కూలీల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొని.. డ్రమ్ సీడర్ విధానం ద్వారా ఆ సమస్యకు చెక్ పెట్టిన రైతు సొంతంగా డ్రమ్ సీడ్ తయారు చేసుకున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు కంచర్ల సోమేశ్వర్ రెడ్డి గారు.. కేవలం 4 వేల రూపాయల ఖర్చుతో 12 ఫీట్ల పొడవు ఉన్న కేసింగ్ పైపు సాయంతో 16 సాళ్ల డ్రమ్ సీడ్ తయారు చేసుకున్నారు. గత మూడు సీజన్లుగా సాగు చేస్తూ మంచి ఫలితాన్ని పొందుతున్నారు. ఈ వీడియోలో తన అనుభవాన్ని, డ్రమ్ సీడర్ ఎలా తయారు చేసుకోవాలనే తీరును సైతం వివరించారు. వీడియోలో రైతు తయారు చేసుకున్న డ్రమ్ సీడర్ కాకుండా కంపెనీ వాళ్లు తయారు చేసిన 8 సాళ్ల డ్రమ్ సీడర్లు కావాలి అనుకునే వాళ్లు 7075062968 నంబరులో కిసాన్ జోన్ కంపెనీని సంప్రదించగలరు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రూ.4 వేల ఖర్చుతో 16 సాళ్ల డ్రమ్ సీడ్ తయారీ విధానం | తెలుగు రైతుబడి
#RythuBadi @RythuBadi #Drumseedmaking
3 окт 2024