Good evening sir, వేద వేదాంగాలునూ సర్వశాస్త్రములనూ "అరటిపండును వలచినంత సులభంగా" విడమర్చి అందిస్తున్నారు, నిజం చెబితే మీరు అంగీకరించరు అది మీ గొప్పదనాన్ని సూచిస్తుంది.
మూడు స్థితులలో.. శరీర భావన.. మానసిక భావన.. ఆత్మ భావనను చక్కగా వివరించారు.. అహం( మనసు).. అనేది పుట్టుకతోలేదని.. మనతో పాటు పెరుగుతూ ఉందని.. పుట్టుకతో శరీరము ప్రాణము మాత్రమే ఉందని.. మరణించే నాటికి.. ప్రాణం పోయి.. మనసు, శరీరము మిగులుతుందని.. కానీ ప్రాణం పోవడంతో.. శరీరానికి విలువ లేదని.. చక్కగా అర్థమైంది అండి.. అంటే మన మనసు మనతోనే ఉంటుంది.. మనం చేసిన కర్మ ఫలాలను వెంటబెట్టుకుని.. శరీరము ప్రాణము లేకపోయినా కూడా.. మరి.. ఆధ్యాత్మిక విద్యలో.. మహిమలు, మాయలు లేవని అన్నారు కదా! మరి కృష్ణ భగవానుడు.. తలుచుకున్నప్పుడు సుదర్శన చక్రం వచ్చి.. అందరినీ చంపడం అనేది.. మాయా, మహిమే కదండీ! అంటే ఆత్మ జ్ఞాన స్వరూపంలో ఉన్న వారికి.. అలాంటి శక్తులు వస్తాయా? తెలియజేయగలరు?
అలాంటి శక్తులు మనుషులకు రావు, వుండవు .. అవి దైవ స్వరూపాలకి సంభందించిన పురాణ కధలు .. నేను మాట్లాడుతున్నది మనుషుల గూర్చి ,,, దైవానికి , మనిషికి ముడి పెట్టకూడదు ...god bless you.. be good .. be happy .. be kind ..