అద్వితీయం!అమోఘం!!అనర్గళం!!! "అనంత" మైన "శ్రీరామ్" కోటి పదాల్లా మీ ప్రసంగం ఆమూలాగ్రం అచ్చ తెలుగు పదాలతో ఆహ్లాదంగా సాగింది. అమ్మ ఔన్నత్యాన్ని ఎన్నిసార్లు పొగిడినా, ఎంతగా అభివర్ణించినా అమ్మ అనే ఆ తీయని పలుకుకు అంతమనేదిలేదు. తెలుగు చిత్రసీమ కవుల్లో కీ.శే. శ్రీ దేవులపల్లి క్రిష్ణశాస్త్రి గారంతటి కీర్తి ప్రతిష్ఠలు మీకు రావాలని ఆశిస్తూ, మీ తెలుగు భాషా పాండిత్యానికి(మీరు సాంకేతిక విధ్యార్థి అయినా) శిరసువంచి పాదాభివందనం చేస్తున్నా. ఆ చదువుల తల్లి శారదామాత తన చల్లని చూపులు మీపై ఎల్లవేళలా ప్రసరింపచేసి, తన ఒడిలో పాపలా మిమ్మల్ని సాకాలని కోరుకుంటూ, మీలానే నేను ఎక్కడా ఆంగ్ల పదప్రయోగం చేయకుండా నా అభిమానాన్ని, అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తీకరించాను శ్రీరామ్ గారు. మీరన్నట్లుగా అమ్మ మీద చిత్ర సీమ లోని కవులందరూ తమదైన శైలిలో చాలా పాటలు రాసారు. అన్ని పాటలు మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈ చిత్రం కొరకు మీరు వ్రాసిన పాట కూడా వాసిలోను,వన్నెలోనూ ఏమాత్రం తీసిపోనిదిగా వుంటుందని ఆకాంక్షిస్తున్నాను. అవును... ఈ సృష్ఠికి మూలం అమ్మ. ఆ దేవుడైనా ఒక అమ్మకు సుతుడే. అంత ఔన్నత్యం గల మాట "అమ్మ" అనే రెండక్షరాల మాట. మానవ జీవితానికది వరాలమూట. శుభం భూఃయాత్త్!-జయప్రకాష్,విశాఖపట్టణం
Naku story artham aipoindhi.. neeli neeli asham only divertion annanata.. Amma 30 days brathukuthundhi.. aa 30 rojulu Amma ni Amma yemi korukundho cheyadame hero pani.. anthena...!