భవరోగవైద్యుఁడవు - అన్నమయ్య సంకీర్తన (Bhavarogavaidyudavu - Annamayya Sankeerthana)
Singer - Srikrishna garu, Composor - Sai Madhukar garu during Annamayya Paataku Pattabhishekam Program by TTD
Lyrics -
భవరోగవైద్యుఁడవు పాటించ నీవొకఁడవే
నవనీతచోర నీకు నమో నమో
అతివలనెడి సర్పా లధరాలు గఱచిన
తతి మదనవిషాలు తలకెక్కెను
మితిలేని రతులఁ దిమ్మరివట్టె దేహాలు
మతిమఱచె నిందుకు మందేదొకో
పొలఁతులనెడి మహాభూతాలు సోఁకిన
తలమొలలు విడి బిత్తలై యున్నారు
అలరు చెనకులచే నంగములు జీరలాయ
మలసి యిందుకు నిఁక మంత్రమేదొకో
తరుణుల కాఁగిలనే తాపజ్వరాలు వట్టి
కరఁగి మేనెల్ల దిగఁ గారఁజొచ్చెను
నిరతి శ్రీవేంకటేశ నీవే లోకులకు దిక్కు
అరుదు సుఖాననుండే యంత్రమేదొకో
5 окт 2024