Тёмный

Renowned Author Acharya Betavolu Ramabrahmam Special EXCLUSIVE Interview | Vyjayanthi | Vyus.in 

Vyus
Подписаться 31 тыс.
Просмотров 26 тыс.
50% 1

Renowned Author Acharya Betavolu Ramabrahmam Special EXCLUSIVE Interview | Vyus.in
#Acharyabetavoluramabrahmam #vyus #Authorbetavoluramabrahmam #Novels #Books #bethavoluvillage #bethavolulifestyle #tikkanabharatam
Sri #chaganti Koteswara Rao SUPER Exclusive Interview #vijayanthi Telugu #pravachanalu | Vyus.in
• Sri #chaganti Koteswa...
అవధాన రాజ్యాంగ నిర్మాత
బేతవోలు రామబ్రహ్మం... కేంద్ర భాష సమ్మాన్ పురస్కార గ్రహీత. తెలుగు భాషకు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా దీనిని కేంద్రం ప్రకటించింది. గుంటూరు సంస్కృత కళాశాలలో అధ్యాపకునిగా ప్రారంభించి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు విభాగ అధిపతిగా ఉద్యోగ జీవితాన్ని విరమించారు. అవధానాలు చేసారు. రేడియోలో అనేక ప్రత్యక్ష ప్రసారాలలో పాల్గొన్నారు. మహామహులతో పరిచయాలు ఆయన సాహిత్య సేవను మలుపు తిప్పాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయాలలో పనిచేశారు. పద్య రచనలో మేటిగా పేరుపొందారు. పద్యమే పరమార్ధంగా జీవించారు. కేంద్ర భాష సమ్మాన్ పురస్కారం లభించిన సందర్భంగా వ్యూస్ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారితో ముఖాముఖి నిర్వహించింది. అవధానాలు, ప్రవచనాలు, భువన విజయాలు, రేడియో కార్యక్రమాలు, ప్రముఖులతో పరిచయాలు... ఇలా ఎన్నో అంశాలను ఆయన వైజయంతి మాటామంతిలో వివరించారు. గురువు ఎలా ఉండాలో తెలియజెప్పారు. ప్రవచనకర్తలు చెప్పాల్సిందేమిటో ఆయన ఇందులో సూచనలు చేశారు.
బేతవోలు రామబ్రహ్మం పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల గ్రామంలో ఒక అతి సామాన్య కుటుంబంలో 1948, జూన్ 10 న జన్మించాడు. కష్టాలే తోడుగా ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు చదివాడు. తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణలో తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పిహెచ్.డి. చేశాడు.
ఉద్యోగం
‘భారతి’ లేని లోటును తీర్చిన ‘వాజ్ఞ్మయి’ త్రైమాసిక పత్రిక పేరు ఇతడు సూచించిందే. హైదరాబాద్‌లో ప్రారంభమై ఏడాది పాటు నడిచిన ఆ పత్రికను బొమ్మూరుకు తీసుకెళ్ళి పరిశోధనలో ప్రామాణికతను పాటిస్తూ తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సంచికగా రూపొందించడంలో కీలకంగా నిలిచాడు. ఇతడి మార్గదర్శకత్వంలో పాతికమంది వరకు పీహెచ్‌డీలు చేసి డిగ్రీలు పొందారు.
2005లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేరారు.
సాహిత్య రంగం
ఇతడు రావూరి వెంకటేశ్వర్లు ప్రోత్సాహంతో, ప్రేరణతో భాషాప్రవీణ రెండవ సంవత్సరం చదివేప్పుడే అవధానాల వైపు ఆకర్షితుడై పద్ధెనిమిదేళ్ల కే (1967లో) నవరాత్రి ఉత్సవాలకు మొదటి అవధానం చేశాడు. దాదాపు పాతిక సంవత్సరాల్లో 300 వరకు అవధానాలు చేసి తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్నాడు. తర్వాత లెక్కలేనన్ని అవధాన సభలకు సంచాలకత్వం వహించాడు. కొవ్వూరు సంస్కృత కళాశాల నుంచి వెలువడే ‘గౌతమి’ మాసపత్రికకు ఒక్క సంవత్సరం పాటు సంపాదకుడుగా వ్యవహరించి అంతవరకు గ్రాంథికంలో వెలువడుతున్న ఆ పత్రికను పూర్తిగా వ్యవహారంలోకి తెచ్చిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఆ పత్రికలో ఇతను ‘జయసింహ చరిత్ర’ ( కల్పిత కథా ప్రబంధం) అన్న శీర్షికతో సరళ శైలిలో పద్యాలు వ్రాశాడు.
ఒకసారి నాగార్జున విశ్వవిద్యాయలంలో బుద్ధిస్ట్ స్టడీస్ కేంద్రాన్ని ప్రారంభిచడానికి భూటాన్ దేశపు మఠాధిపతి జె.కంపూ, వారి బృందం వచ్చారు. వారితోపాటు అప్పటి మన ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, యూజీసీ వైస్ చైర్మన్ ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి కూడా వచ్చారు. ప్రారంభోత్సవం అయ్యాక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బేతవోలు రామబ్రహ్మం రాసిన ‘సౌందర నందం’ నాటకాన్ని ఆ భూటాన్ మఠాధిపతి, బృందం సభ్యులు నిల్చొనే తిలకించారు. నాటకం అయ్యాక బుద్ధుడి భిక్షాపాత్రని డాలర్లతో నింపి, రచయితను అభినందించి, ఆ ఆనందంలో మీరంతా మా దేశం వచ్చి పలుచోట్ల ప్రదర్శనలు ఇవ్వమన్నారు. దాంతో ఇతడు భూటాన్ వెళ్ళి అక్కడ ‘ఉన్మత్త యక్షరాజం, సౌందరనందం’ వంటి బౌద్ధ సంబంధి నాటక ప్రదర్శనలు ఇప్పించి, అక్కడివారి ఆదరాభిమానాలను చూరగొన్నాడు. ఇలా ఇతడు తన రచనల ద్వారా విదేశీయులను సైతం ఆకర్షించాడు.
ఇతడు బొమ్మూరు విశ్వవిద్యాలయం తరపున ఒకసారి ‘వచన కవితకు షష్టిపూర్తి’ అన్న శీర్షికతో కవి సమ్మేళనాలు, సభలు నిర్వహించాడు. తరువాత హైదరాబాదులో ‘ఆంధ్ర పద్య కవితా సదస్సు’ నిర్వహించి నండూరి రామకృష్ణమాచార్యులు అధ్యక్షలుగా,ఇతడు ఉపాధ్యక్షులుగా రాష్ట్రం నలుదిశలా పర్యటించి పద్యం విశిష్టతను తెలిపారు. ఇతడు కొత్త గోదావరి వంటి పద్య కావ్యాలే కాకుండా నాటకాలూ వ్రాశాడు. కథలు వ్రాశాడు. అనువాద రచనలు వ్రాశాడు. సాహిత్య వ్యాసాలు, పరిశోధనా గ్రంథాలు వ్రాశాడు. అన్నింటికన్నా సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు రాసి ఎనలేని కీర్తి గడించాడు. దేవీ భాగవతం వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. తొలినాళ్ళలో నాస్తిక భావాలున్న ఇతడికి ఆధ్యాత్మిక దిగ్ధర్శకత్వం నెరపినవారు లక్ష్మణ యతీంద్రులు. ఇతడికి దిశానిర్దేశం చేసి ఆచార్యునిగా తీర్చినది ఆచార్య తూమాటి దొణప్ప.
Visit us : vyus.in/
Follow Us @
Facebook: / vyustheunbiased
Twitter : / vyusopinion
Join Us @
Telegram : t.me/vyus_The_Unbiassed

Развлечения

Опубликовано:

 

9 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 77   
@SIVARAMAPRASADKAPPAGANTU
@SIVARAMAPRASADKAPPAGANTU 9 месяцев назад
రామ బ్రహ్మం గారు అధ్బుతమైన విషయాలు చెప్పారు. అనేక తెలియని విషయాలు తెలిశాయి. ఎంతో ప్రయోజనకరమైన ఇంటర్‌వ్యూ అందించినందుకు ధన్యవాదాలు.
@ncrao2431
@ncrao2431 9 месяцев назад
చాలా మంచి ఇంటర్వ్యూ. ఆయనకు అడ్డురాకుండా, వారినుంచి ఎన్నో మంచి విషయాలు రాబట్టారు. వారు మహా పండితులే కాకుండా, సత్వగుణసంపన్నులు. అంత పాండిత్యం కలిగిన సత్వగుణసంపన్నులను చాలా అరుదుగా చూస్తాం. మహాగంభీరమైన కంఠం, స్వచ్ఛమైన మనసు, సౌమ్యమైన భావప్రకటన, సున్నితమైన విమర్శ.
@Vyusin
@Vyusin 9 месяцев назад
ధన్యవాదాలు
@rajasekharburra982
@rajasekharburra982 9 месяцев назад
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారితో మాటామంతి చాలా బాగుంది. మాధవరామశర్మ గారు, ఉషశ్రీ గారు, అనంతరామయ్య గారు, జంధ్యాల మహతిశంకర్ వంటి సాహితీ ద్రష్టులు స్మరణ ఎంతో ఆనందం కలిగించింది. రామబ్రహ్మం గారు వారి జీవితం సాహితి సేవకి అంకితం చేసిన మహానుభావులు. కులపతి గారితో భువనవిజయం చూడడం ఇంకా జ్ఞాపకం. వైజయంతి గారు ఇటువంటి వారిని ఇంకా ఎందరినో పరిచయం చెయ్యాలి 🙏👏
@sakshiprasad200
@sakshiprasad200 9 месяцев назад
అటువంటి మహా మహులు ఉన్నంతవరకు మన తెలుగు కల కాలం బ్రతికే వుంటుంది. వ్యూస్ ఛానల్ ద్వారా గొప్ప గొప్ప వారిని పరిచయం చేస్తున్నారు.🙏🙏
@rvsbhagavanulu3875
@rvsbhagavanulu3875 9 месяцев назад
విద్యావంశాగ్రజులైన రామబ్రహ్మంగారు అద్భుతంగా వివరించారు.ఇంతసమయం వారి అనుభవాలను వినే అదృష్టం లభించింది. కళాశాలాసమయం కన్నులకు కట్టింది.వారి పాదపద్మములకు వినయపూర్వక ప్రణామములు.
@ushagarikapati9748
@ushagarikapati9748 8 месяцев назад
స్తోత్రమంజరిలో అమ్మవారి మంగళహారతి రాసినవారు వీరేనా 🤗
@sudharanimulpuru6881
@sudharanimulpuru6881 9 месяцев назад
మా గురువు గారి మాటలు వినే అదృష్టం మళ్ళీ మాకు కలిగించినందుకు వైజయంతి గారికి ధన్యవాదాలు 🙏
@Sri-Satya
@Sri-Satya 9 месяцев назад
ఈగొంతు చిన్నప్పుడు రేడియోలో లీలగ విన్న గుర్తు. ఇప్పుడు చూస్తుంటే చాల సంతోషంగా ఉంది
@58Dharani
@58Dharani 9 месяцев назад
ఒక సారి svbc వారు నిర్వహించిన ఉగాది కార్యక్రమం లో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి పక్కన కూర్చునే అదృష్టం కలిగింది. అంతే కాదు వారి తో మాట్లాడే అవకాశం కూడా దొరికింది. సాక్షాత్తూ సరస్వతీ కటాక్షం లబించిన అపర సాహితీ మూర్తి. వారికి వినయపూర్వక ప్రణామములు.
@srinivasaraopotturi8764
@srinivasaraopotturi8764 9 месяцев назад
ఆర్యా, నమస్కారము మీ అవధాన అనుభవములు చాలా చక్కగా చెబుతున్నారు. మీరు చాలా శ్రావ్యముగా, సమగ్రముగా మాట్లాడుతారు. మీ సుందరకాండ, దేవీభాగవతము చదివాను. చాలా బాగున్నవి. మీరు ఎదురుగా ఉండి చెప్పినట్లుగా ఉంటుంది. 😅😮😅
@lakshminandula5303
@lakshminandula5303 9 месяцев назад
ఎన్నో రకాల విశే షాలతోకూడిన పరిచయ ప్రసంగము మాకు తెలిసే అవకాశంకలిగించినందుకు👌👍🤝👏🙌
@prasadduggina7688
@prasadduggina7688 9 месяцев назад
My favorite Acharya Sree Betavolu Rama brahmam garu all time great from nallajerla participating translate from Sanskrit to Telugu
@kasulu57
@kasulu57 9 месяцев назад
బేతవోలు రామబ్రహ్మం గారి సాహిత్య ప్రసంగం సామాన్య జనాన్ని కూడా ఆకర్షించే విధం గా ఉంటుంది.మాకు తెలియని విషయాలు రాబట్టిన వ్యూస్ కి ధన్యవాదాలు...
@durgaannamraju5267
@durgaannamraju5267 9 месяцев назад
గురువు గారికి నమస్కారములు. 🙏🙏
@commonman6304
@commonman6304 9 месяцев назад
మీ ఛానల్ నుంచి మేము ఆశించేది.. ఇవే..!! నిజాయితీకి నిలువెత్తు రూపం.. ఈ సాహితీమూర్తి. సహజత్వం.. ఈయన తత్వం..!! ధన్యోస్మి..!!
@sudhacarawraunaccaw4659
@sudhacarawraunaccaw4659 9 месяцев назад
Prof Bethavolu gaaru a live and walking encyclopaedic scholar of repute and renown and we are blessed by his objective and discerning erudition and wisdom...💐🌹
@boddurattaiah887
@boddurattaiah887 9 месяцев назад
Many thanks to Smt Vyjayanti gariki and to sri B Ramabrahamma gari It is an excellent work by her with her good knowledge skills 2:14:06 2:14:06
@SkyITLMT
@SkyITLMT 9 месяцев назад
అద్భుతంగా వుంది , రామబ్రహ్మం గారు చక్కటి విషయాలు వివరించారు. వైజయంతి గారు ఎప్పటిలాగే మంచి ప్రశ్నలు వేశారు . ఒక చిన్న విషయంలో జాగ్రత్త తీసికొని ఉండాల్సింది - కార్డు లో రామబ్రహ్మం గారి గురించిన వివరాలు అన్ని ఏకవచనంలో వున్నాయి , సవరించుకోగలరు.
@meenakshimalladi409
@meenakshimalladi409 7 месяцев назад
🙏maa చిన్నతనం లో స్కూల్ కి వెళ్ళేటప్పుడు వార్తలు విని వెళ్ళేవాళ్ళం స్కూల్ బస్ 7.10 కి వచ్చేది మా నాన్నగారు రాత్రి 7.30 వార్తలు వినగానే భోజనాలు కి రమ్మనే వారు. ఆ కంట స్వరం ఇంకా మా కు గుర్తు వుంది. ఇప్పటి వార్తలు వినలంటేనే విసుగ్గా వుంటుంది వెంకథల ఎవరి తరుముకు వస్తున్నట్టు music danchii కొడుతున్న వాన అంటూ అర్థం పర్థం లేని భాష ప్రయోగాలు చాలా భాధ గ వుంటుంది
@bandagangaraju378
@bandagangaraju378 8 месяцев назад
HIGHLY ENLIGHTENING INTERVIEW ....Congratgulations to Vyjayanthi garu and Ramabrahmam garu.
@snehalathamurali9566
@snehalathamurali9566 9 месяцев назад
మీ దేవీభాగవతం నేను రోజూ. పారాయణ చేస్తూ తరిస్తున్నాను.మీకు మా వందనాలు
@indirababbellapati8916
@indirababbellapati8916 9 месяцев назад
వినడం మా అదృష్టం. నమస్సులు.
@hemavathihosur3235
@hemavathihosur3235 9 месяцев назад
గురువు గారు చెప్పిన ప్రతి మాట చాలా విలువైనది..అలాంటి గొప్పవారికి శిష్యులవడం మీ అదృష్టం. చివర్లో ప్రవచనకర్తల గురించి చాలా చక్కగా చెప్పారు..ఆయన మా ఎదురుగా కూర్చుని మాట్లాడినట్టనిపించింది. అలాంటి వారిని చూసి/వినే భాగ్యం కల్పించిన మీకు నమస్సుమాంజలి
@Vyusin
@Vyusin 9 месяцев назад
ధన్యవాదాలు
@nagajasastrymunimadugu3673
@nagajasastrymunimadugu3673 9 месяцев назад
🙏🙏🙏 చాలా అద్భుతంగా, సరళంగా, ఉన్నతంగా, సున్నితంగా, ధర్మబద్ధంగా, నిష్పక్షపాతంగా, వివరంగా, ఉత్సాహభరితంగా, ఉల్లాసభరితంగా నేటి కాలానుగుణంగా, మార్గదర్శకంగా సాగిన కార్యక్రమం. శ్రీ రామబ్రహ్మం గారికి నమస్కార శతము 🙏 అమ్మా, మీరు వినయ విధేయతలతో నిర్వహించారు. అభినందనలు 👏
@jwalaumamaheswarasarmanade594
@jwalaumamaheswarasarmanade594 9 месяцев назад
పెద్దల అనుభవాలు భవితకు సోపానాలు.మంచిపరిచయంచేసినందులకు ధన్యవాదాలు. శ్రీబేతవోలు రామబ్రహ్మంగారు నాగురించిశతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యగారు జ్వాలాశతకంవ్రాస్తే దానికి ముందు మాటగా సమీక్షించటంనా అదృష్టం. వీరితో ఒంగోలు వచ్చినపుడు పలుమార్లుమాట్లాడటం మాఅదృష్టం వారికి ఐదు పదిచేస్తూ....
@s.sambasivarao9131
@s.sambasivarao9131 9 месяцев назад
Running commentr bhadrachalamu lo first commentry ac college lo teluguupanysakudu ga unnapperumarichanu ""sri ramuniki raka metla daka " annadatalu inka gurtunnayi,ssrao,85 years guntur..
@anantakaranam3341
@anantakaranam3341 8 месяцев назад
Very valuable and educational interview. Paadabhivandanamulu.
@vaanakka
@vaanakka 9 месяцев назад
నేను కూడా చేయగలిగితే ఎంత బాగుణ్ణు అని అనిపించింది. అమెరికాలో ఉంటున్నాను .పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. మన దేశం వచ్చి ఉండాలని ఉంది. మి లాగే నేనూ చేయగలిగితే చిన్న మార్పు చేస్తాను. పేడ తీసి నప్పుడు gloves వేసుకుంటాను.
@syamalatelikapalli7188
@syamalatelikapalli7188 9 месяцев назад
Atyadbhutam
@rohitrohit-np4uo
@rohitrohit-np4uo 7 месяцев назад
Excellent!
@kgirijalakshmi2024
@kgirijalakshmi2024 9 месяцев назад
గురువు గారికి నమస్కారములు.ఎన్నో కొత్త విషయాలు,మంచి విషయాలు తెలుసుకుని ఆనందించాము . ధన్యవాదాలు.
@sameerkumark9684
@sameerkumark9684 9 месяцев назад
🙏సాహితీ మూర్తికి ప్రణామములు 💐 🙏
@narasingaraomedepalli7361
@narasingaraomedepalli7361 9 месяцев назад
ధన్యవాదాలు వైజయంతి గారు.విలువగలసంభాషణ
@prasadduggina7688
@prasadduggina7688 9 месяцев назад
Super Guruji nice interview thanks sir
@prabhakargovindaraju2568
@prabhakargovindaraju2568 8 месяцев назад
గురువుగారి లాంటి వారి వలనే తెలుగు ఇంకా బ్రతికి వుంది. కార్యక్రమం చాలా ఆనందం కలిగించింది. ఆకాశవాణిలో వారి కార్యక్రమాలు కూడ ఒక కారణం. మళ్ళీ ఆ రోజులు చూస్తామా? 🙏
@devulapallishyamsundher3466
@devulapallishyamsundher3466 9 месяцев назад
చాలా బాగుంది. ఉభయులకు పాదాభి వందనాలు..
@jagannadhacharyulusribhash3025
@jagannadhacharyulusribhash3025 9 месяцев назад
pravachanaala vishayam chalaa bagaa cheppaaru.
@satyavathimadala2301
@satyavathimadala2301 9 месяцев назад
Thank you very much for ramugarini chupinchinanduku
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 9 месяцев назад
I like the speech of guruvu garu.arya meeku Vanda vandanalu
@appalarajukoppaka172
@appalarajukoppaka172 9 месяцев назад
మీరు వ్రాసిన జీవన వ్యాకరణము కవిత జీవితంలో మర్చి పోనిది.
@tnvajji8560
@tnvajji8560 9 месяцев назад
Sir meeru Telugu varigaa puttadam Maa adhrushtam.
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 9 месяцев назад
Namasthae Vyjayanthi garu, Glad to know you are Daughter of Ushashri garu ! Many many thanks for bringing up this inverview with Sri Acharya Betavolu Ramabrahmam garu ! Very nice voice to listen and learn from !
@haripriyavasireddy4573
@haripriyavasireddy4573 9 месяцев назад
Sir. ,🙏🏼it is an enlightment to people like us.May our Telugu language come to limelight again.u r all gems in the garland of mother Saraswathi
@Krishna-kc1yf
@Krishna-kc1yf 9 месяцев назад
Pranamamulu guruvu gariki
@yanamandra1326
@yanamandra1326 9 месяцев назад
నమస్కారములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vedantamsripatisarma
@vedantamsripatisarma 9 месяцев назад
Interesting, enriching and entertaining.
@sivaramakilla9785
@sivaramakilla9785 9 месяцев назад
Namaskaram to Guruvu garu..I saw the first Astavadhanam in life in 1982 in Vijayawada by Guruvu garu..
@jagannadhacharyulusribhash3025
@jagannadhacharyulusribhash3025 9 месяцев назад
great.bethavolu varito rajahmundry lo parichayam.mahaa vidwamsulu.
@bhargaviravi1
@bhargaviravi1 9 месяцев назад
Excellent work Amma
@iiigraghu
@iiigraghu 9 месяцев назад
Excellent Presentation 💐 🤝 🙏
@tdl951
@tdl951 9 месяцев назад
వైజయంతి గారు, మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటాను. సొంత ఇంట్లో మనిషి, అక్కా చెల్లెళ్ళు గుర్తుకు వస్తారు.
@Vyusin
@Vyusin 9 месяцев назад
ధన్యవాదాలు
@venkataramaapparaopalapart2590
@venkataramaapparaopalapart2590 9 месяцев назад
నమస్కారం అండి
@cmr66mdhu
@cmr66mdhu 9 месяцев назад
Namaskaaramulu guruvu gaariki
@durgaannamraju5267
@durgaannamraju5267 9 месяцев назад
ఇలాంటి గొప్ప వారు ఇంకా ఎక్జాడాక్కడ ఉన్నారు తెలుగు భాష వైభవం కొంచమైన నిలిచి ఉంది
@ravipsarva
@ravipsarva 9 месяцев назад
బ్రహ్మ 🙏🙏🙏
@padmavativ8955
@padmavativ8955 9 месяцев назад
నమస్సులు
@NVS-kc8ew
@NVS-kc8ew 9 месяцев назад
I don't know about Sri Betavolu Garu,but I saw him on NTR Kalamantapam in Telugu University and heard about him through some speakers, very glad for your inner view about his service to Telugu language Madam thank U , Om Shanti
@jayanthiravi5835
@jayanthiravi5835 9 месяцев назад
🙏🙏
@satyamshivam4943
@satyamshivam4943 9 месяцев назад
Good inter view. Kani yarlagadda Vari Draupadi ki sahityapu viluvalu lekapoyina Dainik sahitya academy bahumati ravadam baledu andee
@govindaprasadtulasi3810
@govindaprasadtulasi3810 9 месяцев назад
Krishnaparamatma okksre guruvu.
@pssastri5696
@pssastri5696 9 месяцев назад
Namaskarum
@tadepalliprasad
@tadepalliprasad 9 месяцев назад
చాలా "inspirational".its said and well the "simplest are the greatest"వారిని విన్న తర్వాత!
@vinaytalluri
@vinaytalluri 9 месяцев назад
Amma interviews chaala bagutunnayi. OkE okka vinnapam(dayachEsi correct chEsukOnDi), ekkaDa mee pEru vEsina mundu mana inTipEru vastundi, anthE kani inTipEruni ilaa venaka raasukunE paddati bharatheeya/arsha samskruti kadu.
@Vyusin
@Vyusin 9 месяцев назад
అలాగేనండీ
@kotikelapudinarasimharao7543
@kotikelapudinarasimharao7543 9 месяцев назад
The father of thyaagyaya is ramabrahmam
@turlapatisuguna1265
@turlapatisuguna1265 9 месяцев назад
👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kvsastry6317
@kvsastry6317 9 месяцев назад
🙏👌🙏
@pssastri5696
@pssastri5696 9 месяцев назад
Elantiprogramskavaliknoweldgeki
@balajigadde6389
@balajigadde6389 9 месяцев назад
Very nice❤❤❤😂
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 9 месяцев назад
🙏🙏🙏👍👌🙋🌹🌷
@praajnatherockstar
@praajnatherockstar 9 месяцев назад
It is a great video. Very well spoken. Is there any way I can know his email id for any further doubts wherein to email sir? Hoping to get a response
@osnmurty6317
@osnmurty6317 9 месяцев назад
రామబ్రహ్మం గారి పేరులో ఉంది ఆఁ పటుత్వ కవిత్వ సంపదల్
@krikis9056
@krikis9056 9 месяцев назад
GUNTUR BRAMAHNALUUU
Далее
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 3,8 млн
Аминка ❤️
00:16
Просмотров 827 тыс.
Stay on your way 🛤️✨
0:34
Просмотров 23 млн
Ещё и в кредит
1:01
Просмотров 4,2 млн
There’s A Starman #superman #shorts #memes
0:26
Просмотров 46 млн
БАТЯ И ТЁЩА😂#shorts
0:58
Просмотров 6 млн