Тёмный
No video :(

Special Article: Dokra Metal Craft Artisans I Adilabad district🟥 DD News Telangana 

DD NEWS Telangana
Подписаться 35 тыс.
Просмотров 215
50% 1

ఇత్తడితో అద్భుతమైన కళారూపాలకు ప్రాణం పోస్తున్నారు ఆదివాసీ కళాకారులు. అన్ని రకాల కళారూపాలను అందంగా రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈ కళారూపాలు మన్నలు పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తమ కళ నైపుణ్యంతో అబ్బురపరుస్తున్న డోక్ర మెటల్ క్రాఫ్ట్ కళాకారులపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ఆదివాసీల కళకు దేశ, విదేశాల్లో ఖ్యాతి ఉంది. ఈ ప్రాంతంలో ఇత్తడిని కరిగించి చేసే డోక్ర మెటల్ క్రాఫ్ట్ కళాకృతులు నయనానదకరంగా ఉంటాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఈ కళ పై ఆధారపడి దాదాపు రెండు వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరు తమ పూర్వికుల నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.
ఇత్తడితో అనేక కళారూపాలకు ఆదివాళీ కళాకారులు అవలీలగా ప్రాణం పోస్తారు. దేవత మూర్తుల విగ్రహాలతో పాటు చిన్నారుల ఆట వస్తువులు, నెమలి, హంస ఆకృతులు, పూల కుండీలు, వివాహాలలో అవసరమయ్యే సృజనాత్మక వస్తువు సామాగ్రి, దీపకుందులు. ఇలా అనేక వస్తువులు
ప్రాణం పోసుకునేది ఇక్కడే. గుడి గంటలు, ఏనుగు, గణపతి, ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా విగ్రహాన్ని అందంగా తయారు చేయడంలో వారికివారే సాటి.
ముందుగా అనుకున్న కళారూపాన్ని మనసులోనే ఊహించుకుంటూ సన్నటి మట్టితో తయారు చేస్తారు. తర్వాత మైనంతో అచ్చు తయారు చేసి కరిగించిన ఇత్తడితో ఓ రూపం తీసుకొస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో వారసత్వంగా వచ్చిన హస్తకళ నైపుణ్యమే వీరికి ఆధారం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొద్దుపోయే దాక వివిధ సృజనాత్మక ఆకృతులను అందంగా మలచడమే వీరి వ్యాపకం. తమ ప్రతిభకు గుర్తింపుగా పలువురు రాష్ట్రపతులు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల నుంచి. ఎన్నో ప్రశంసలు, సత్కారాలు పొందారు. దేశ రాజధాని డిల్లీ సహా ప్రముఖ నగరాల్లో ఆదిలాబాద్ డోక్ర క్రాఫ్ట్ తో ప్రదర్శనలు నిర్వహించారు.
హరప్పా మొహంజొదారో కాలంలో కళాఖండాల తయారీలో ప్రస్థానం ప్రారంభమై. కాలం గడిచే కొద్ది వంటింటి పాత్రల నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తూ తమ కీర్తిని నలుదిశగా వ్యాపింప చేశారు. నాలుగేళ్ల క్రితం ప్రతిష్టాత్మకమైన భౌగోళిక గుర్తింపు-జీఐ ట్యాగ్. ఆదిలాబాద్ డోక్ర కళాకృతులకు వరించింది. ఇంతటి అద్భుతమైన నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం కరువైందని ఆదివాసీ గిరిజన కళాకారులు వాపోతున్న తరుణంలో ఇటీవల ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ మాన్ కి బాత్ లో స్వదేశీ హస్తకళల ప్రోత్సాహానికి బాసటగా నిలువడంతో ఇక్కడి కళాకారులకు భరోసా నింపింది. రాబోయే రోజుల్లో తమకు మంచి రోజులు వస్తాయని ఆశతో ఉన్నారు.

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Dhokra Metal Casting - Adilabad
9:36
Просмотров 31 тыс.
A Minecraft Movie | Teaser
01:20
Просмотров 25 млн